నేషనల్ టూరిజం అవార్డుల్లో తెలంగాణ సత్తా..

నేష‌న‌ల్ టూరిజం అవార్డుల్లో తెలంగాణ స‌త్తా చాటింది.పర్యాటక రంగంలో విశేష వృద్ధిని సాధించిన తెలంగాణ.

వివిధ విభాగాల‌తో క‌లిపి మొత్తం 4 అవార్డుల‌ను ద‌క్కించుకుంది.ఈ మేర‌కు ప్ర‌పంచ ప‌ర్యాట‌క దినోత్స‌వాల్లో భాగంగా ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ ధ‌న్‌క‌డ్ నుంచి రాష్ట్ర ప‌ర్యాట‌క మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డుల‌ను స్వీక‌రించారు.

ప‌ర్యాట‌క ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధిలో ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.అదేవిధంగా హైద‌రాబాద్ గోల్ఫ్ క్ల‌బ్‌కు బెస్ట్ గోల్ఫ్ కోర్స్ అవార్డు, ఉత్త‌మ రైల్వే స్టేష‌న్‌గా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్, బెస్ట్ మెడిక‌ల్ టూరిజం ఫెసిలిటీగా హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రి ఎంపికైంది.

ట్రూడోకు షాక్.. ఈసారి మత సమూహాల చూపు కన్జర్వేటివ్‌ల వైపే, కెనడాలో సంచలన సర్వే