Tejaswini Gowda : అమర్ దీప్ వ్యాధుల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించిన తేజస్విని.. ఏమైందంటే?
TeluguStop.com
తెలుగు సినీ ప్రేక్షకులకు బుల్లితెర నటుడు అమర్ దీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అమర్ దీప్ ప్రస్తుతం బిగ్ బాస్( Bigg Boss ) లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
దాదాపు 13 వారాల నుంచి హౌస్ లో కొనసాగుతూ ఇప్పుడు టికెట్టు ఫినాలే రేసులో భాగంగా ఇతర కనిపిస్తున్నలకు టఫ్ ఫైట్ ని ఇస్తున్నారు.
ఇది ఇలా ఉంటే అమర్ దీప్ భార్య నటి తేజస్విని గౌడ( Tejaswini Gowda ) గురించి కూడా మనందరికీ తెలిసిందే.
ఆమె కూడా బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
"""/" /
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన భర్త అమర్ దీప్( Amar Deep ) గురించి ఆయన ఆరోగ్య విషయాల గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది.
తేజస్విని కూడా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమర్ దీప్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సందర్భంగా తేజస్విని మాట్లాడుతూ.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందే అన్ని పరీక్షలు చేయించగా ఆయనకు పలు సమస్యలు ఉన్నట్లు తెలిసింది.
ముఖ్యంగా మజిల్ గ్రోత్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.ఆయన శరీరంలో సరిపడా విమిన్లు లేక మజిల్ గ్రోత్ జరగట్లేదని స్పష్టం చేసింది.
బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆయన అదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
"""/" /
కానీ అది చెబితే సింపథీ గేమ్ అంటారని ఎవరికీ తెలియకుండా చూసుకుంటున్నారు అని చెప్పుకొచ్చింది తేజస్విని.
ప్యామిలీ వీక్ లో భాగంగా తాను హౌస్ లోకి వెళ్లినప్పుడు కూడా అమర్ వీపు భాగంలో నొప్పి ఉన్నట్లు చెప్పాడని ఇప్పటికీ తాను ఒక ఆయింట్మెంట్ పంపిస్తున్నట్లు తెలిపింది తేజస్విని( Tejaswini Gowda ).
రాత్రి పూట పడుకున్నాక ఆయన ఆ ఆయింట్ మెంట్ పెట్టుకున్నారని కానీ సింపథీ గేమ్ మాత్రం ఆడట్లేదని ఆయన గురించి క్లారిటీ ఇచ్చింది.
అయితే తామిద్దరూ కలిసి డ్యాన్స్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ఆ సమస్య ఎదురైందని దాన్ని నుంచి ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారని తేజస్విని వెల్లడించింది.
అలాగే తాను కూడా లోబీపీ సమస్యతో బాధ పడుతున్నట్లు వివరించింది.
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది… ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!