బిగ్ బాస్ అఖిల్ తో ప్రేమలో ఉన్న తేజస్వి… ఇలా క్లారిటీ ఇచ్చేసిందిగా?

తేజస్వి(Tejaswi) మదివాడ పరిచయం అవసరం లేని పేరు.సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజస్వి అనంతరం పలు సినిమాలలో నటించి సందడి చేశారు.

అయితే ఈమెకు పెద్దగా సినిమాల ద్వారా గుర్తింపు రాలేదని చెప్పాలి.ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడపాదడపా అవకాశాలను అందుకున్నటువంటి తేజస్వి బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.

బిగ్ బాస్(Bigg Boss) ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో తరచూ పెద్ద ఎత్తున సందడి చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న అఖిల్(Akhil) తో కలిసి ఈమె బీబీ జోడీలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

"""/" / ఇలా ఈ కార్యక్రమంలో వీరిద్దరి డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.

ఇలా వీరి పర్ఫామెన్స్ ప్రేక్షకులకు పెద్ద ఎత్తున సందేహాలను కలిగించిందని చెప్పాలి.అయితే తాజాగా ఈ విషయం గురించి తేజస్వి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే తేజస్వి తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు.

ఈ క్రమంలోనే నేటిజన్స్ అడిగిన ప్రశ్నకు ఈమె సమాధానాలు చెప్పారు. """/" / ఈ సందర్భంగా ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ మీరు అఖిల్ తో రిలేషన్ లో ఉన్నారా అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు తేజస్వి సమాధానం చెబుతూ హి ఈస్ ఏ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అన్నట్టు సమాధానం ఇచ్చింది.

ఈ విధంగా ఈమె సమాధానం ఇవ్వడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు.

ఒకవేళ రిలేషన్ లో లేకపోతే ఫ్రెండ్ అని సమాధానం చెప్పేది అలాకాకుండా లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని సమాధానం చెప్పారు అంటే తప్పకుండా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని నెటిజెన్స్ భావిస్తున్నారు.

ప్రస్తుతం తేజస్వి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దంతాల ఆరోగ్యానికి తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!