ఎన్నికల సంఘం తప్పిదమే బీహార్ ఫలితాలు అంటున్న తేజస్వీ!

ఎన్నికల సంఘం తప్పిదమే బీహార్ ఫలితాలు అంటున్న తేజస్వీ!

ఇటీవల వెల్లడైన బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం అందుకున్న విషయం తెలిసిందే.

ఎన్నికల సంఘం తప్పిదమే బీహార్ ఫలితాలు అంటున్న తేజస్వీ!

అయితే ఈ ఎన్నికల ఫలితాల్లో మహాఘట్ కూటమి కి 110 సీట్లు సొంతం కాగా, ఎన్డీయే కూటమి 125 సీట్లు సాధించి మరోసారి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ఎన్నికల సంఘం తప్పిదమే బీహార్ ఫలితాలు అంటున్న తేజస్వీ!

అయితే ఈ ఎన్నికల ఫలితాలు ఎన్నికల సంఘం తప్పిదమే అంటూ మహాకూటమి సీఎం అభ్యర్థి,ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బిహార్‌ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.ఎన్నికల సంఘం మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసిందంటూ ఆయన ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా ఇలా జరగడం ఇదే తొలిసారి ఏమి కాదు అని,గతంలో 2015 లో కూడా ఎన్నికల సంఘం ఇలాంటి ఫలితాలనే విడుదల చేసింది అంటూ ఆరోపణలు చేసారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి విజయం సాధించింది.ఎగ్జిట్ పోల్స్ మహాఘట్ కూటమి కి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించినప్పటికీ ఫలితాలు మాత్రం తారుమారు అయ్యాయి.

దీనితో బీహార్ శాస‌న‌స‌భ ఫ‌లితాల్లో ఎన్డీయే కూట‌మి 125(బీజేపీ 74, జేడీయూ 43, వీఐపీ 3, హెచ్ఏఎం 4), మ‌హాఘ‌ట‌బంధ‌న్ 110(ఆర్జేడీ 75, కాంగ్రెస్ 19, సీపీఐఎంఎల్ఎల్ 11, సీపీఎం 3, సీపీఐ 2), ఎల్జేపీ ఒక స్థానంలో, ఇత‌రులు 7 స్థానాల్లో గెలుపొందారు.

"""/"/ బీహార్‌లో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్ 124.దీనితో బీహార్ లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.

అయితే గత ఎన్నికల కంటే కూడా బీహార్ బీజేపీ పార్టీ అత్యధిక స్థానాలు దక్కించుకోవడం తో ఇప్పుడు సీఎం గా జేడీ అధినేత నితీష్ కుమార్ ను మరోసారి సీఎం పీఠం ఎక్కిస్తుందా లేదంటే మరొకరి పేరు తెరమీదకు తీసుకువస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

రోజు ఈ పొడిని పాలల్లో మిక్స్ చేసి తాగితే నిద్ర తన్నుకొస్తుంది..!

రోజు ఈ పొడిని పాలల్లో మిక్స్ చేసి తాగితే నిద్ర తన్నుకొస్తుంది..!