దర్శకుడు తేజ అడల్ట్‌ మూవీ కంప్లీట్‌

న్యూ ఏజ్‌ లవ్‌ స్టోరీలకు పెట్టింది పేరు అయిన దర్శకుడు తేజ ఇండస్ట్రీలో ఎన్నో ట్రెండ్‌ సెట్టర్‌ చిత్రాలను చేశాడు.

అద్బుతమైన కథ మరియు కథనాలను ఏమీ లేకుండానే సింపుల్‌ కథలను ప్రేక్షకులకు అర్థం అయ్యే కథనంతో ప్రజెండ్‌ చేయడం వల్ల విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈయన ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.

ఒక్క హిట్‌ రెండు ఫట్‌ అన్నట్లుగా కెరీర్‌ సాగుతోంది.ఇలాంటి సమయంలో ఈయన ఒక వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.

ఆ విషయమై ఆయన శిష్యుల నుండి పూర్తి క్లారిటీ వచ్చేసింది.తేజ నుండి వస్తున్నది వెబ్‌ సిరీస్‌ కాదట ఒక వెబ్‌ మూవీగా వారు పేర్కొన్నారు.

దానికి కూడా తేజ దర్శకత్వం వహించలేదు ఆయన సహాయ దర్శకుడు అయినా ఒక యంగ్‌ డైరెక్టర్‌తో చేయించాడట.

ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన విషయాలను వారు చెబుతు నిజాం కాలం నాటి ప్రేమ కథతో ఈ సినిమాను రూపొందించారు.

కథను తేజ అందించాడు.విభిన్నమైన కథనంతో చాలా చక్కని భావోద్వేగతంతో సినిమాను రూపొందించారంటూ సమాచారం అందుతోంది.

కథానుసారం కాస్త బోల్డ్‌ కంటెంట్‌ అధికంగానే జొప్పించారంటూ సమాచారం అందుతోంది.నందిని రాయ్‌ కీలక పాత్రలో కనిపించిన ఈ వెబ్‌ మూవీ నిడివి దాదాపుగా గంట ఉంటుందట.

దీనికి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల చేస్తారట.గంట నిడివి ఉన్న సినిమా ఏంటో అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

దర్శకుడు తేజ కూడా వర్మను ఫాలో అవుతున్నాడేమో అంటున్నారు.గంట నిడివి ఉన్న సినిమా తన సొంత డిజిటల్‌ థియేటర్‌లో తేజ విడుదల చేసే అవకాశం కూడా ఉందంటున్నారు.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)