సోలో హీరోగా రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్
TeluguStop.com
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత నటుడుగా,హీరోగా మారి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కొంత మంది చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్స్ గా మారారు.రాశి, రంభ లాంటి అందాల భామలు చైల్డ్ ఆర్టిస్ట్ చేసి తరువాత హీరోయిన్స్ అయ్యారు.
అనూ ఇమ్మాన్యుయేల్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ అయ్యింది.అలాగే జూనియర్ ఎన్ఠీఆర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి తరువాత హీరోగా ఎదిగాడు.
ఇప్పుడు అదే దారిలోకి మరో నటుడు వస్తున్నాడు.మాస్టర్ తేజ అంటే ఎవరికీ పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఇంద్ర సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే వెంటనే అందరికి గుర్తుకొస్తాడు టాలీవుడ్ యాక్టర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తోపాటు పలువురు హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా తేజ సజ్జ నటించాడు.
చైల్డ్ హీరో నుంచి టీనేజ్ లోకి వచ్చిన తేజ ఇప్పటికే ఓ బేబీ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
చాలా రోజుల నుంచి సోలో హీరోగా సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే ఒక సినిమా స్టార్ట్ స్టార్ట్ అయ్యింది.
ఇంకా మొదటి సినిమా పూర్తి కాకుండానే రెండో సినిమాకి సంతకం చేసేశాడు.ఇప్పుడు మరో ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
రొమాంటిక్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ చిత్రం ఇష్క్ మూవీని తెలుగు రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.
మెగా సూపర్ గుడ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించనుంది.ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మొత్తానికి హీరోగా టర్న్ అయిన చైల్డ్ ఆర్టిస్ట్ కెరియర్ చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.
మరి దానికి తగ్గట్లుగానే తెలుగులో స్టార్ హీరోగా మారే అవకాశాలు ఉన్నాయా అనేది వేచి చూడాలి.