హనుమాన్ హీరో తేజకు సర్జరీ… సినిమా కోసం అన్ని ఇబ్బందులు పడ్డారా?

ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో తేజ సజ్జ( Teja Sajja ) హీరోగా మన హనుమంతుడిని ఆధారంగా తీసుకొని ఓ సూపర్ హీరో కథగా తెరకెక్కిన సినిమా హనుమాన్ ( Hanuman ).

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది .

ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా కోసం హీరో తేజ పడినటువంటి కష్టం గురించి తెలియజేస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

"""/" / ఈ కార్యక్రమంలో హీరో తేజ మాట్లాడుతూ ఈ సినిమా కోసం తాము రెండున్నర సంవత్సరాల పాటు కష్టపడ్డామని తెలిపారు.

ఈ సినిమా చేయడం కోసం మరే సినిమాలకు కూడా కమిట్ అవ్వలేదని తేజ తెలిపారు.

సినిమాలో ఓ ఫైట్ లో రోకలిబండతో విలన్ మనుషులని కొట్టి ఆ రోకలి, మనిషిని భుజం మీద వేసుకొని నడిచే సీన్ చేసే సమయంలో తన మెడ పూర్తిగా నొప్పి చేసి షూటింగ్ కూడా రాలేకపోయానని తెలిపారు.

అలాగే క్లైమాక్స్ ఆంజనేయస్వామి వచ్చే షాట్ లో తేజ కూడా గాలిలో ఉంటాడు.

ఈ సీన్ కోసం దాదాపు 5 గంటల పాటు తాను గాలిలోనే ఉన్నానని తెలిపారు.

"""/" / ఇక క్లైమాక్స్ సీన్ దాదాపు 40 రోజులపాటు దుమ్ము ధూళి పొగ మధ్యలో చేసామని ఈ సీన్ చేసేటప్పుడు ఈయన కళ్ళకు బాగా ఎఫెక్ట్ అయిందని తెలిపారు.

ఈ షూటింగ్ పూర్తి అయ్యే లోపు తన కుడి కన్ను సరిగ్గా కనిపించలేదని హాస్పిటల్ కి వెళ్తే కార్నియా దెబ్బ తింది ఆపరేషన్ చేయాలి అన్నారట.

తనకు సర్జరీ కూడా చేయాలని డాక్టర్లు చెప్పారు కానీ సినిమా విడుదలైన తరువాతే సర్జరీ చేయించుకుంటానని తేజ వెల్లడించినట్లు తెలిపారు.

ఇలా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ఆ కష్టానికి తగ్గ విషయం అందింది అంటూ చిత్రబృందం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

దేవుడా.. న్యూడిల్స్ తిన్నట్లు బతికున్న పాములను అలా తినేస్తుందేంట్రా బాబు (వీడియో)