‘హనుమాన్‌’ టీజర్ కు ఖర్చు పెడుతున్న మొత్తం ఎంత?

తేజ సజ్జా హీరో గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ చిత్రం యొక్క టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తెలుగులోనే కాకుండా ఈ సినిమా ను అన్ని ఇండియన్ భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

పాన్ ఇండియా సినిమా గా ఇప్పటికే ప్రచారం జరుగుతున్న ఈ సినిమా యొక్క టీజర్‌ స్పందన అదే స్థాయిలో ఉంది.

ఈ సినిమా యొక్క టీజర్ కి అక్కడ ఇక్కడ అన్నిచోట్ల మంచి ప్రశంసలు దక్కాయి.

రికార్డ్ స్థాయి వ్యూస్ తో ఈ సినిమా దూసుకు పోతుంది.ఈ సమయం లోనే ఈ సినిమా యొక్క బడ్జెట్ గురించి ఆసక్తి జరుగుతుంది.

15 కోట్ల రూపాయల లోపు బడ్జెట్ తోనే ఈ సినిమా ను రూపొందించినట్లుగా ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.

ఆ విషయం పై మరింత స్పష్టత కోరుతూ కొందరు సోషల్ మీడియా లో యూనిట్‌ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.

ఈ సినిమా యొక్క విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని.ఒక హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాల స్థాయిలో విజువల్స్, గ్రాఫిక్స్ ఉండడం తో కచ్చితంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తూ ఉంటారని అంతా భావిస్తున్నారు.

కానీ ఈ సినిమా యొక్క బడ్జెట్ మాత్రం తక్కువే అని చెప్తున్నారు.ముఖ్యం గా విజువల్స్ ఎఫెక్ట్స్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు అంటూ అంతా ఆసక్తిగా ప్రశ్నిస్తూ ఉన్నారు.

కానీ చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం నాణ్యమైన విజువల్స్ కోసం పెద్దగా ఖర్చు చేయడం లేదని.

కానీ ప్రేక్షకులను విజువల్ వండర్ లో విహరింపజేస్తాం అంటూ వారు చెబుతున్నారు.తక్కువ ఖర్చుతోనే అద్భుతమైన విజువల్స్ ని పూర్తి రాబడుతున్నారని తెలుస్తోంది.

హనుమాన్ సినిమా లో హీరోయిన్ గా అమృత అయ్యర్‌ నటిస్తోంది.వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వైరల్: అదిరిపోయిన షారుఖ్, ఐశ్వర్య రాయ్ పిల్లల స్టేజ్ షో!