సంక్రాంతి రేసు నుంచి ఆ ఒక్క సినిమా తప్పుకోనుందా..?

ఎప్పటిలాగే ఈ సంక్రాంతికి పెద్ద ఎత్తున సినిమాలు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.సంక్రాంతికి మరో నెలన్నర సమయం మాత్రమే ఉంది.

కనుక ఇప్పటికే సంక్రాంతికి ఉండే సినిమాలు ఏంటి, ఏ సినిమాలు సంక్రాంతికి సందడి చేస్తాయి అనేది తేలిపోయింది.

ఈ ఏడాది ఆరంభం నుంచే నేను అంటే నేను అంటూ సంక్రాంతికి సినిమాల ప్రకటన చేయడం జరిగింది.

కానీ అందులో కొన్ని తప్పుకోవడం తో కొన్ని నిలిచాయి.రామ్‌ చరణ్‌( Ram Charan ) గేమ్‌ చేంజర్‌ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంది, ఇక ప్రభాస్ ప్రాజెక్ట్‌ కే సినిమా కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది.

"""/" / నిన్న మొన్నటి వరకు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌, రవితేజ ఈగల్‌ మరియు తేజ సజ్జ హనుమాన్‌ సినిమాలు విడుదల అవ్వబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తేజ సజ్జా( Teja Sajja ) యొక్క హనుమాన్ సినిమాను( Hanuman Movie ) కాస్త ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.

వీఎఫ్‌ ఎక్స్ వర్క్ విషయంలో జాప్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని యూనిట్‌ సభ్యులు ఆఫ్ ది రికార్డ్‌ చెప్పారు.

అయితే అధికారికంగా మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు.ఇలాంటి రిలీజ్ వాయిదా పుకార్లు చాలానే వస్తూ ఉంటాయి.

కానీ హనుమాన్ సినిమా కచ్చితంగా సంక్రాంతికి వస్తుంది అంటూ కొందరు యూనిట్‌ సభ్యులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

"""/" / మరి ఎంత వరకు ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాతలు, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ( Directed By Prashant Verma ) మాట నిలుపుకుంటాడు అనేది చూడాలి.

ఆదిపురుష్ సినిమా విడుదల అయిన సమయంలోనే ఈ సినిమా ను విడుదల చేయాలని భావించారు.

ఒకానొక సమయంలో ఆదిపురుష్ కంటే ముందుగానే హనుమాన్ వస్తుంది అన్నారు.కానీ రాముడు వచ్చిన తర్వాతే హనుమాన్ వస్తాడు అంటూ గ్రాఫిక్స్ కోసం సమయం కేటాయించారు.

ఇప్పుడు అదుగో ఇదుగో అంటూ వాయిదాలు వేస్తున్నారు.సంక్రాంతి విషయంలో త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.

DOGE నుంచి తప్పుకోవడంపై వివేక్ రామస్వామి స్పందన .. మస్క్‌‌పై షాకింగ్ కామెంట్స్