హనుమాన్ బడ్జెట్ నిజంగా అంతేనా? బాలీవుడ్ మేకర్స్ ఆశ్చర్యం
TeluguStop.com
తేజ సజ్జా హీరో గా అమృత అయ్యర్ హీరోయిన్ గా ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో రూపొందిన హనుమాన్ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.
తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ ని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా యొక్క టీజర్ ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఆ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆదిపురుష్ టీజర్ తో పోలిస్తే ఈ టీజర్ మరింత బాగుందంటూ సోషల్ మీడియా లో జనాలు మాట్లాడుకుంటున్నారు.
ఇదే సమయం లో బ్రహ్మాస్త్ర సినిమా యొక్క మేకర్స్ కూడా ఈ సినిమా యొక్క మేకింగ్ ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.
తెలుగు తో పాటు అన్ని ఇండియన్ భాషల్లో ఈ సినిమా ను విడుదల చేసే విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ యూనిక్ కాన్సెప్ట్ తో సినిమా ను రూపొందించారని సమాచారం అందుతుంది.
అందుకే ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
"""/"/
టీజర్ ను అన్ని భాషల్లో విడుదల చేయడం జరిగింది.టీజర్ లోని విజువల్స్ చూసిన తర్వాత ఈ సినిమా కు కేవలం 12 నుండి 13 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయింది అంటే నమ్మశక్యంగా లేదు అంటూ బాలీవుడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారట.
స్టార్ కాస్టింగ్ ఎక్కువ లేక పోవడంతో మేకింగ్ కి దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కువ ఖర్చు చేశాడు.
అయినా కూడా అది తక్కువ బడ్జెట్ సినిమానే అవుతుంది.అప్పుడు కూడా అద్భుతమైన అవుట్ పుట్ వచ్చిందంటూ బాలీవుడ్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
బ్రహ్మాస్త్ర ఆదిపురుష్ ఇంకా బాలీవుడ్ లో రూపొందిన కొన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ఎంతో ఉత్తమమైన సినిమా అన్నట్లుగా వారు కామెంట్స్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కార్తికేయ 2 సినిమా స్థాయిలోనే ఈ సినిమా కచ్చితంగా భారీ విజయాన్ని ఉత్తర భారతం లో దక్కించుకుంటుందని నమ్మకాన్ని మీడియా సర్కిల్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.
నదిలో పడిపోయిన యజమాని.. నది ఒడ్డునే 4-రోజులు వెయిట్ చేసిన కుక్క.. ఎక్కడంటే..?