ఎన్ఠీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవడం పై మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శకుడు తేజ

సినీ పరిశ్రమలో ముక్కు సూటి తనం అనేది పనికిరాదు.ఎవరు ఎలా ఉన్నా అందరినీ కలుపుకొని పోవాలి లేదంటే వారిపై ఒక ప్రత్యేక ముద్ర పడిపోతుంది.

ఆలా సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక ముద్ర పడిపోయిన వారిలో ముందుగా చెప్పుకొనే వ్యక్తి,డైరెక్టర్ తేజ.

సినీ పరిశ్రమలో ఆయనపై ఒక మార్క్ పడిపోయింది.ఆయన ముక్కు సూటిగా మాట్లాడుతారని,కోపం ఎక్కువ ఇలా.

అంతేకాకుండా సినిమా పరంగా తనకు కావాల్సింది రాబట్టుకోవడానికి ఆయన ఎలాంటి నిర్ణయం అయినా తీసుకుంటారు అంటూ చాలా నే ఉన్నాయి.

అయితే గతంలో ఆయన ఎన్ఠీఆర్ బయో పిక్ కు దర్శకత్వం వహిస్తున్నారు అని ముహూర్తం షాట్ కూడా తీశారు.

అయితే అనూహ్యంగా తేజ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఆ తరువాత ఆ చిత్రాన్ని క్రిష్ జాగర్ల మూడీ డైరెక్షన్ లో చిత్రాన్ని పూర్తి చేయడం జరిగిపోయింది.

అయితే ఈ చిత్రం నుంచి తేజ ఎందుకు తప్పుకున్నారో అన్న విషయం అర్ధంకాక బాలయ్య కు తేజ కు మనస్పర్థలు వచ్చాయని అందుకే ఆ చిత్రం నుంచి తేజ తప్పుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తల పై తాజాగా తేజ ఒక క్లారీటీ ఇచ్చారు.ఎన్టీఆర్ గొప్ప నటుడు, నాయకుడు.

నేను ఇష్టపడే హీరోలు ఇద్దరే ఇద్దరు.ఒకరు ఎన్టీఆర్.

ఎంజీఆర్.అలాంటి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందే సినిమాకు న్యాయం చేయలేనని అనిపించింది.

ఎన్టీఆర్ ను గొప్పగా చూపించే స్టామినా నాకు లేదనిపించింది.

అందుకే తప్పుకొన్నాను అని తేజ అన్నారు.ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఓపెనింగ్ అయిన తర్వాత కథను లోతుగా పరిశోధన చేశాను.

అప్పుడు ఎన్టీఆర్ కు న్యాయం చేయలేనని అనిపించింది.అంతేకాని బాలకృష్ణతో విభేదాలు రావడం వల్ల బయటకు వచ్చాననే వార్త అబద్ధం.

నా వ్యక్తిగత ఆలోచనల ప్రకారమే ఆ సినిమా నుంచి బయటకు వచ్చాను అని తేజ తెలిపారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్,బెల్లంకొండ శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సీత అనే చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో మీడియా తో మాట్లాడారు.

ఈ సందర్భంగా తేజ పై వ్యాఖ్యలు చేశారు.ఆ చిత్రానికి న్యాయం చేయలేనని తప్పుకున్నాను తప్ప బాలయ్య తో నాకు ఎలాంటి విభేదాలు లేవని తేజ క్లారిటీ ఇచ్చారు.

అయితే క్రిష్ డైరెక్టన్ లో వచ్చిన ఎన్ఠీఆర్ బయోపిక్ రెండు భాగాలను చూడలేదని తేజ తెలిపారు.

చిత్రాన్ని చూసి ఓపెన్ గా మాట్లాడితే అదొక సమస్య అవుతుంది అని ఆ చిత్రం లో ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదని తేజ వ్యాఖ్యానించారు.

ప్రజలకు మెరుగైన పథకాలను అందించడమే జగన్ లక్ష్యం..: విజయసాయి రెడ్డి