ఎన్నాళ్ళు మొహం దాచేస్తారు రాజా..!

దగ్గుబాటి వారసుడు అభిరాం హీరోగా అహింస సినిమా వస్తున్న విషయం తెలిసిందే.తేజ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి నేడు ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

సినిమా ఎనొన్స్ మెంట్ పోస్టర్ నుంచి ఈరోజు రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ దాకా అభిరాం ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు.

అహింస షూటింగ్ స్టార్టింగ్ డేట్ కూడా అదే మొహం ని కవర్ చేస్తూ పెదాల నుంచి రక్తం కారుతున్న ఫోటో పెట్టారు.

ఇక నేడు రిలీజైన టీజర్ లో కూడా అదే విధంగా ఫేస్ ఎక్కడ రివీల్ అవకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ టీజర్ చూసి సినిమాలో అయినా అభిరాం ఫేస్ చూపిస్తారా లేదా అని కామెంట్స్ చేస్తున్నారు.

అభిరాం చేస్తున్న మొదటి సినిమాగా ఈ మూవీపై బజ్ పెంచాలని చూస్తున్నారు.అయితే తేజ ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది.

మరి తేజ డైరక్షన్ లో సినిమాతో ఎంట్రీ ఇస్తున్న అభిరాం ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

ఇప్పుడు ఏమాత్రం ఫాం లో లేని తేజ డైరక్షన్ లో అభిరాం సినిమా అనగానే దగ్గుబాటి ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది.

అయితే రానాతో తేజ తీసిన సినిమా హిట్ అవడంతో ఈ అహింస మీద అంచనాలు పెరిగాయి.

యూకేలో భారతీయ టెక్కీకి 15 రోజుల క్రిస్మస్ సెలవులు.. ఇండియాలో ఇంటర్నెట్ షేక్