Samantha Naga Chaitanya : సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోడానికి ఫోన్ ట్యాపింగ్ కారణమా?

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ( Phone Tapping ) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది.

అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కారణంగా ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సమంత (Samantha) నాగచైతన్య ( Naga Chaitanya ) విడిపోవడానికి కూడా ఇదే కారణం అంటూ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కేవలం ఫోన్ ట్యాపింగ్ కారణంగానే సమంత నాగచైతన్య విడిపోయారని ఈయన తెలియజేయడమే కాకుండా త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా వీడియో రూపంలో తెలియజేస్తామని వెల్లడించారు.

"""/"/ ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna ) మాట్లాడుతూ.నటి సమంత ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, ఇలా వారికి బేరం కుదరకపోవడంతో ఆ వీడియోని అక్కినేని ఫ్యామిలీకి పంపించారని తెలుస్తోంది.

సమంత( Samantha ), చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని, ఆయన మందుల వ్యాపారం చేస్తాడని, ఆయనే ఇదంతా చేశాడని తీన్మార్‌ మల్లన్న ఈ సందర్భంగా ఈ విషయాలను తెలియచేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

"""/"/ ఇలా సమంత నాగచైతన్య విడిపోవడం వెనుక ఓ రాజకీయ నాయకుడు( Political Leader ) ఉన్నాడని, ఫోన్ ట్యాపింగ్ కారణంగానే విడిపోయారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియడం లేదు.ఇక నాగచైతన్య కూడా ఓ సందర్భంలో సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ తమ విడాకులకు( Divorce ) కారణమయ్యాయి అంటూ ఈయన కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే.

విడాకుల తర్వాత ఈ జంట వారి సినీ కెరియర్  లో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ తో సినిమా అంటే అది ఉండాల్సిందే.. యంగ్ హీరో కార్తికేయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!