కాకరకాయ సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి అధిక దిగుబడి పొందేందుకు మెళుకువలు..!

వ్యవసాయ రంగంలో రైతులు ( Farmers )ఏ పంటను చేసిన అధిక దిగుబడి ( High Yield )పొంది మంచి ఆదాయం పొందాలంటే.

పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడంతో పాటు పంట సాగుపై పూర్తి అవగాహన ఉండాలి.సాగు పై అవగాహన ఉంటేనే పంటను సంరక్షించుకోవడానికి వీలు ఉంటుంది.

తీగ జాతి కూరగాయ పంటలలో ఒకటైన కాకర పంటకు ( Bitter Gourd Cultivation )చీడపీడల బెడద చాలా తక్కువ.

కాకర పంటను పందిరి విధానంలో సాగు చేసి, కోతల సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు.

కాకర పంటల సాగుకు అనువైన నేలల విషయానికి వస్తే.ఇసుకతో కూడిన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఎండిపోయే నేలలు కూడా పంట సాగుకు అనుకూలమే.ఇలాంటి నెలలలో సేంద్రియ ఎరువులను( Organic Fertilizers ) సమృద్ధిగా వాడాలి.

"""/" / ముందుగా నేలను లోతు దుక్కులు దున్నుకుంటే.నేలలో బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి అవశేషాలు సూర్యరశ్మి వల్ల నాశనం అవుతాయి.

ఆ తర్వాత మిగతా పంటల అవశేషాలు ఏవైనా ఉంటే మొత్తం పొలం నుంచి తీసేయాలి.

ఇక నేలను చదును చేసుకుని, మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలే విధంగా పందిరి ఏర్పాటు చేసుకోవాలి.

పంట విత్తిన 45 రోజుల తర్వాత పూత వస్తుంది.ఆ సమయంలో పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా చీడపీడలు ( Pests )ఆశిస్తే సకాలంలో గుర్తించి సంరక్షక చర్యలు చేపట్టి వాటిని అరికట్టాలి.

"""/" / కాకర పంట 60 నుంచి 70 రోజుల మధ్యలో మొదటి కోతకు వస్తుంది.

కాకర ఎక్కువ చలిని తట్టుకోలేదు.కాబట్టి కోతల తర్వాత వీలైనంత త్వరగా పంటను మార్కెట్ చేయాలి లేదంటే తీవ్ర నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాకరకాయలు ( Bitter Gourd )ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.కాకరకాయలను పాలీప్రోఫైలిన్ బ్యాగ్ లో ప్యాక్ చేయాలి.

సాగు విధానంలో ఏవైనా సందేహాలు ఉంటే వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిది.

బన్నీపై కేసును విత్ డ్రా చేసుకుంటాను.. రేవతి భర్త సంచలన నిర్ణయం వైరల్!