మల్లె పూల సాగులో కొమ్మ కత్తిరింపులలో పాటించాల్సిన మెళుకువలు..!
TeluguStop.com
భారతదేశంలో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పూలల్లో మల్లెపూల సాగు( Jasmine Flowers ) కూడా ఒకటి.
రైతులు మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.
మల్లెలో విడిమల్లె, దొంతమల్లే, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలు ఉన్నాయి.మల్లె ను అంటూ మొక్కలు తొక్కడం ద్వారా గాని, కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ ప్రవర్థనం చేయవచ్చు.
మల్లె తోట సాగు చేపట్టిన మూడో సంవత్సరం నుండి దాదాపుగా 15 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది.
ప్రతి సంవత్సరం జనవరి నెలలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
కోమ్మ కత్తిరింపులు జరిపిన తర్వాత పది రోజులకు నీటి తడిని అందించాలి. """/" /
నేలలోని తేమశాతాన్ని బట్టి ఐదు రోజులకు ఒకసారి పూలు కోసే సమయంలో నీరు పారించాలి.
కొమ్మల కత్తిరింపులు తర్వాత ఒక వారం రోజులకు ఒక్కో చెట్టుకు పది కిలోల పశువుల ఎరువు, 75 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పొటాష్( Murate Of Potash ), 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల అమోనియం సల్ఫేట్( Ammonium Sulfate ), 500 గ్రాముల ఆముదము పిండి లేదంటే వేపపిండి ను చెట్టు చుట్టూ చిన్నగాడి తీసి అందులో వేసి మట్టితో కప్పి నీటిని పారించాలి.
"""/" /
ఇలా ఎరువులను కొమ్మ కత్తిరింపులు జరిపిన తర్వాత అందిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.
మల్లెమొగ్గల్ని ఉదయం కోసి మార్కెట్ కు తొందరగా పంపిస్తే.మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది.
తాజాదనం కోసం కోసిన మొగ్గలు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఒక లీటరు నీటిలో పది గ్రాముల సుక్రోస్ ను కలిపిన ద్రావణంలో 10 నిమిషాలు ముంచి కాసేపు ఆరబెట్టిన తర్వాత ప్యాకింగ్ చేయాలి.
ఎంత ఫ్రెష్ గా ఉంటే మార్కెట్లో అంత మంచి డిమాండ్ ఉంటుంది.
బ్లాంకెట్లు, బెడ్‌షీట్ల విషయంలో రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్