దొండ పంటలో ఎరువుల యజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలు..!
TeluguStop.com
తీగజాతి కూరగాయలలో దొండ కూడా ఒకటి.దొండ పంట( Donda Crop ) లాభదాయకంగా ఉంటుంది.
సరైన సస్యరక్షక చర్యలు చేపడుతూ సాగు చేస్తే ఆశించిన స్థాయిలో దిగుబడులు సాధించవచ్చు.
దొండ పంటను పందిరి విధానంలో సాగు చేస్తే, మూడు సంవత్సరాల పాటు పంట దిగుబడిని అధికంగా పొందవచ్చు.
దొండ పంటకు సారవంతమైన నేలతో పాటు, నీటి సౌలభ్యం చాలా అవసరం.తేమతో కూడిన పొడి వాతావరణం ఈ పంట సాగుకు చాలా అనుకూలం.
దొండ పంటను ఏడాది పొడవునా ఎప్పుడైనా నాటుకొని సాగు చేయవచ్చు.కాకపోతే మే, జూన్, జూలై, ఫిబ్రవరి నెలలో నాటుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.
"""/" /
దొండ సాగును కాండం మొక్కల ద్వారా ప్రవర్దనం చేస్తారు.రెండు సెంటీమీటర్ల మందం, 20 సెంటీమీటర్ల పొడవు ఉండేలా కాండాన్ని ముక్కలుగా చేయాలి.
ఈ కాండానికి నాలుగు కణుపులు ఉండేలా చూసుకోవాలి.ఒక ఎకరానికి సుమారుగా 2000 కాండం ముక్కలు అవసరం.
ఈ కాండం మొక్కలను ముందుగా విత్తన శుద్ధి చేసుకోవాలి.ఒక లీటరు నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ ద్రావణం( Copper Oxychloride Solution ) కలిపి ఆ ద్రావణంలో ఈ కాండం మొక్కలను ఓ పది నిమిషాలు ముంచి, ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవాలి.
మొక్కల మధ్య ఒక మీటరు దూరము, మొక్కల వరుసల మధ్య రెండు మీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
"""/" /
ఈ కాండం మొక్కలను నాటడానికి ఒక అడుగు లోతు గుంతలు తీయాలి.
ఆ గుంతలో మట్టి, కంపోస్ట్ ఎరువును కొద్దిగా ఇసుక కలిపి వేయాలి.ఆ గుంతలో 100 గ్రాముల ఎరువును 7:10:5 N.
P.K నిష్పత్తిలో వేసుకోవాలి.
కాండం మొక్కలు నాటిన 45 రోజులకు పూత వస్తుంది.నాటిన 85 రోజులకు దొండ పంట చేతికి వస్తుంది.
నేలలోని తేమ శాతాన్ని బట్టి వారం రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.
పంటను ఎప్పటికప్పుడు చీడపీడల, తెగుళ్ల బెడద నుండి సంరక్షించుకుంటే ఒక ఎకరం పొలంలో దాదాపుగా 60 టన్నుల దిగుబడి పొందవచ్చు.
పైలెట్ అయిన పనిమనిషి కొడుకు.. ఆమె బ్యూటిఫుల్ రియాక్షన్ వైరల్..