జొన్న పంటలో పోషక ఎరువుల యాజమాన్యంలో పాటించాల్సిన మెళుకువలు..!

జొన్న పంటను( Sorghum Crop ) పాడి పశువులు ఉండే రైతులు కచ్చితంగా సాగు చేస్తారు.

ఎందుకంటే జొన్నను ఆహారంగా, పశువులకు దానగా ఉపయోగిస్తారు.కాబట్టి జొన్న పంటకు మార్కెట్లో ఎప్పుడు మంచి గిట్టుబాటు ధరే లభిస్తుంది.

జొన్నలలో చాలా రకాలు ఉన్నాయి.నేల స్వభావాన్ని బట్టి అధిక దిగుబడులు ఇచ్చే మేలురకం విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగుచేపట్టాలి.

CSH-16 రకం సాగు చేస్తే ఒక ఎకరం పొలంలో దాదాపుగా 15 టన్నుల దిగుబడి పొందవచ్చు.

ఈ రకం పంటకాలం 105 నుంచి 110 రోజులు.నంద్యాల తెల్ల రకం జొన్నలను సాగు చేస్తే ఒక ఎకరం పొలంలో దాదాపుగా 16 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

ఈ రకం పంట కాలం 95 నుండి 100 రోజులు.పాలెం-2 రకం సాగు చేస్తే ఒక ఎకరం పొలంలో 13 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.

ఈ రకం పంటకాలం 105 నుండి 110 రోజులు. """/" / జొన్న పంట సాగుకు ఖరీఫ్,( Kharif ) రబీ( Rabi ) రెండు కాలాలు అనుకూలంగానే ఉంటాయి.

జొన్న పంటను సాగు చేసే నేలలో ముందుగా ఇతర పంటలకు సంబంధించిన వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి.

ఆ తరువాత ఒక ఎకరం పొలానికి నాలుగు టన్నుల పశువుల ఎరువును( Cattle Manure ) వేసి పొలాన్ని కలియదున్నాలి.

పోషక ఎరువుల యాజమాన్య విషయానికి వస్తే.ఒక ఎకరం పొలానికి 35 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 10 కిలోల పోటాష్ ఎరువులు అవసరం.

నత్రజనిని ఒకేసారి కాకుండా రెండు సమభాగాలుగా చేసుకుని పంట విత్తేటప్పుడు ఒకసారి, పంట మోకాలు ఎత్తుకు ఎదిగిన తర్వాత మిగిలిన సగభాగాన్ని పంటకు అందించాలి.

నేలను భూసార పరీక్ష చేయించి ఏవైనా పోషకాలాలోపం ఉంటే వాటిని అందించాలి. """/" / నీరు నిల్వ ఉండని నల్లరేగడి నేలలు, ఇతర సారవంతమైన నేలలు జొన్న పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.

ఇక ఒక ఎకరం పొలానికి నాలుగు కిలోల విత్తనాలు అవసరం.ఒక కిలో విత్తనానికి మూడు గ్రాముల థైరం లేదా కప్టాన్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి.

మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.

విత్తనాలు విత్తిన రెండు రోజులలోపు ఒక లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల అట్రాజిన్ ను కలిపి పిచికారి చేస్తే కలుపు సమస్య ఉండదు.

దీంతో ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు పొందవచ్చు.

హీరోయిన్ వైష్ణవి చైతన్యను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారా.. నిర్మాత ఎస్కేఎన్ క్లారిటీ ఇదే!