Broccoli : బ్రోకలీ పంటలో కలుపు నివారణకు చర్యలు.కోతల సమయంలో పాటించాల్సిన మెళుకువలు..!

బ్రోకలీ( Broccoli ) పంట క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లకు సంబంధం ఉండే బ్రాసికాసీ కుటుంబానికి చెందిన పంట.

బ్రోకలీ చూడడానికి క్యాబేజీ లాగే కనిపిస్తుంది.కాకపోతే పువ్వు ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

శీతల ప్రదేశం ఈ పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది.బ్రోకలీ సాగులో ప్రపంచంలోనే భారతదేశం రెండవ స్థానంలో ఉంది.

బ్రోకలీలో అధిక పోషకాలు ఉంటాయి.దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రహిత రోగాలు( Non-cancerous Disease ) తగ్గడమే కాకుండా గుండె జబ్బులను కూడా నివారిస్తుంది.

ఈ పంట సాగుకు రోజువారి ఉష్ణోగ్రత 15 నుండి 23 డిగ్రీల మధ్య ఉంటే పంటకు అనుకూలంగా ఉంటుంది.

ఈ పంట వేగవంతంగా, సరిగ్గా పెరగాలంటే తేమతో కూడిన వాతావరణం అవసరం. """/" / నర్సరీలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు విత్తుకోవాలి.

నర్సరీలో నాట్లు వేసిన నెల రోజుల తర్వాత పొలంలో నాటుకునేందుకు నాట్లు సిద్ధంగా ఉంటాయి.

మొక్కలు ఆరోగ్యకరంగా పెరగాలంటే మొక్కల మధ్య 45 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.

ఈ పంట సాగుకు అవసరం అయ్యే ఎరువుల విషయానికి వస్తే.ఒక హెక్టార్ పొలంలో సుమారుగా 20 టన్నుల కుళ్ళిపోయిన ఎరువు వేయాలి.

వీటితోపాటు 100 కిలోల నత్రజని( Nitrogen ) , 75 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ ఎరువులు అందించాలి.

అయితే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను రెండు సంభాగాలుగా చేసుకొని, ఆఖరి దుక్కిలో ఒకసారి, పంట నాటుకున్న నెల రోజుల తర్వాత మరోసారి పంటకు అందించాలి.

"""/" / ఈ పంట సాగులో కలుపును నివారించాలంటే.బ్రోకలీ తక్కువ లోతులో పెరిగే పంట కాబట్టి, పంట ప్రారంభ దశలో మూడు లేదా నాలుగు సార్లు కూలీలతో కలుపు తీపించాలి.

ప్రధాన పొలంలో నారు నాటుకోవడానికి కనీసం ఒకరోజు ముందు ఒక హెక్టార్ పొలంలో 2.

5 పెండిమిథాలిన్( Pendimethalin ) ను పిచికారి చేయాలి.పంట నాటుకున్న నెల రోజులకు మొక్కల మొదల వద్ద మట్టిని ఎగదోయాలి.

పంట కోతల సమయంలో కాడలు 10 నుండి 15 సెంటీమీటర్లు ఉండేటట్లు కత్తితో కొయ్యాలి.

పువ్వు ఆకుపచ్చగా, కంపాక్ట్ గా ఉండాలి.కోతలు ఆలస్యమైతే పువ్వు వదులుగా మారుతుంది.

నాణ్యతను నిర్ధారించడానికి మొలకలు లేదా పువ్వును క్రమం తప్పకుండా తీసుకోవాలి.మొలకలు 10 నుంచి 12 రోజుల తర్వాత మళ్లీ కోతకు సిద్ధంగా ఉంటాయి.

పంట కోసిన తర్వాత పువ్వులను వెంటనే క్రమబద్ధీకరించి గ్రేడిరగ్ చేసి బుట్టలో ప్యాక్ చేసి మార్కెట్ కు పంపించాలి.

పంటను నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద దాదాపుగా 10 రోజుల వరకు నిలువ చేసుకోవచ్చు.

వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!