పొట్లకాయ సాగు చేసే విధానంలో అధిక దిగుబడి కోసం మెళుకువలు..!

పొట్లకాయ( Snake Guard ) తీగజాతి పంటలలో ఒకటి.పొట్లకాయలు చూడడానికి పాములు లాగా కనిపిస్తాయి కానీ చాలా రుచిగా ఉంటాయి.

కాబట్టి మార్కెట్లో పొట్లకాయలకు మంచి డిమాండ్ ఉంది.కొన్ని సస్యరక్షక మెలకువలు పాటిస్తే.

మంచి దిగుబడి సాధించి ఊహించని లాభాలను అర్జించవచ్చు.పొట్లకాయ ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ అనే రెండు రకాల రంగులలో ఉంటుంది.

నేల యొక్క స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి ఈ రెండు రకాల లో ఏ రకాన్ని సాగు చేయాలో ఎంపిక చేసుకొని సాగు చేయాలి.

పొట్లకాయ సాగుకు ప్రధానంగా అధిక తేమ అవసరం ఉంటుంది. """/" / సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఇస్తే నాణ్యమైన పంట పొందవచ్చు.

ముందుగా పొలాన్ని మంచిగా లోతు దుక్కులు దున్నుకొని ఇతర పంటల అవశేషాలను పూర్తిగా తొలగించండి.

అనంతరం సేంద్రీయ ఎరువులు( Organic Fertilizers ) వేసి పొలాన్ని కలయదున్నాలి.ఈ పొట్లకాయ విత్తనాలను జనవరి రెండో వారం వరకు విత్తుకోవచ్చు.

పొట్లకాయ మొక్కల మధ్య 80 సెంటీమీటర్ల దూరం వరుసల మధ్య ఒకటి పాయింట్ ఐదు మీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకొని, పందిరి విధానంలో సాగు చేయాలి.

"""/" / మల్చింగ్ విధానంలో సాగు చేస్తే.చీడపీడలను, కలుపును సులభంగా నివారించవచ్చు.

విత్తనాలు విత్తిన ఒకరోజు తర్వాత నీటి తడిని అందించాలి.ఆ తర్వాత వారం వ్యవధిలో మరోసారి తేలికపాటి నీటి తడిని అందించాలి.

ఇక నేలలోని తేమ శాతాన్ని బట్టి నీటి తడులు అందించాలి.ముఖ్యంగా పొట్లకాయ అభివృద్ధి దశలో ఉన్నప్పుడు నీటిని సమృద్ధిగా అందించాలి.

పొట్లకాయ సాగుకు ముందే విత్తనాలను శుద్ధి చేయడం వల్ల పంటకు వివిధ రకాల తెగుళ్లు, చీడపీడలు ఆశించకుండా ఉంటాయి.

పందిరి విధానంలో సాగు చేస్తున్నట్లయితే ఒక్కో పాదులో కనీసం మూడు లేదా నాలుగు విత్తనాలు విత్తుకోవచ్చు.

విత్తనాలు 8 నుండి పది రోజుల్లో మొలకెత్తుతాయి.మొక్కలు పందిరి పైకి ఎక్కే విధంగా మొదటి నుండే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

పంటను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ ఏవైనా తెగులు లేదా చీడపీడలు పంటను ఆశిస్తే వెంటనే 5మి.

లీ వేప నూనెలో ఒక లీటరు నీటిని కలిపి పంటకు బాగా పిచికారి చేయాలి.

Bet Andreas — обзор платформы и её возможностей