దొండకాయ సాగులో అధిక దిగుబడి కోసం మెళుకువలు..!
TeluguStop.com
తీగ జాతి కూరగాయలలో దొండకాయ( Ivy Gourd ) కూడా ఒకటి.ఈ దొండకాయ సాగు వల్ల ఏడాది పొడవునా నిలకడైన ఆదాయాన్ని పొందవచ్చు.
శాశ్వత పందిరి నిర్మాణానికి కేవలం ఒక్కసారి పెట్టుబడి పెడితే ఏళ్ల తరబడి దొండ సాగు చేస్తూ లాభాలను పొందుతూ ఉండవచ్చు.
రైతులు ఈ పంటపై అవగాహన కలిగించుకుంటే మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందవచ్చని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.
అయితే దొండసాగును సాధారణ పద్ధతిలో కాకుండా పందిరి విధానంలో సాగు చేస్తే మొదటి సంవత్సరం పెట్టుబడి భారం కాస్త అధికంగానే ఉంటుంది.
ఎందుకంటే మొదటి సంవత్సరం పందిరి ఏర్పాటు చేసుకోవడానికి వ్యయం అవుతుంది. """/" /
దొండ సాగుకు నీరు నిలువ ఉండని అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.
ఇతర కూరగాయల సాగు( Vegetables Cultivation ) కంటే దొండ సాగు కాస్త భిన్నంగా ఉంటుంది.
దొండ తీగలను ముక్కలుగా కోసి నేలలో నాటితే వాటికి వేర్లు వచ్చి మొక్కలుగా ఎదుగుతాయి.
ఒక ఎకరం పొలంలో 900 వరకు మొక్కలు నాటుకోవచ్చు.పందిరిని స్తంభాలు, కర్రల ఆధారంగా ప్లాస్టిక్ లేదా ఇనుప తీగల ద్వారా ఏర్పాటు చేసుకోవాలి.
ఒక ఎకరం పొలంలో పది టన్నుల పశువుల ఎరువులు అవసరం. """/" / నేలలోని తేమ శాతాన్ని బట్టి పగటిపూట మాత్రమే పంటకు నీటి తడులు అందించాలి.
ఏవైనా మొక్కలకు తెగుళ్లు ఆశిస్తే ఆ మొక్కలను పంట నుండి వేరుచేసి నాశనం చేయాలి.
దొండ పంట నాటిన 30 రోజుల నుంచే దొండ కాయలు వచ్చిన, పూర్తిగా దిగుబడి రావడానికి 90 రోజులు పడుతుంది.
దొండ సాగులో కూలీల ఖర్చు చాలా తక్కువ.అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా తెగుళ్ల, చీడపీడల బెడద ఏర్పడితే తొలిదశలోనే తిని అరికట్టాలి.
పంట పొలంలో ఎప్పటికప్పుడు కలుపును నివారించాలి.నీరు మొక్కల పాదుల వద్ద నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
దొండ సాగు చేసే ప్రాంతంలో 25 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే మొక్కల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది.
ఒక ఎకరం పొలంలో ఏడాదికి దాదాపుగా 60 టన్నుల దిగుబడి సాధించవచ్చు.ఒక కిలో రూ.
7 కు అమ్మిన రూ.4 లక్షలకు పైగానే దిగుబడి పొందవచ్చు.
ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ సినిమా మీద పెరుగుతున్న క్రేజ్…