Begumpet Airport : ఇండియన్ ఎయిర్‎ఫోర్స్ అకాడమీ విమానంలో సాంకేతిక లోపం.. సేఫ్ ల్యాండింగ్.!

ఇండియన్ ఎయిర్‎ఫోర్స్ అకాడమీ( Indian Air Force Academy ) విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

హైడ్రాలిక్ వింగ్స్ ఓపెన్ కాకపోవడంతో ఎయిర్‎ఫోర్స్ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది.ఈ క్రమంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు ( Begumpet Airport ) అధికారులకు పైలట్లు సమాచారం అందించారు.

దాదాపు గంటన్నర సమయం పాటు బేగంపేట విమానాశ్రయం పరిసరాల్లో చక్కర్లు కొట్టిన విమానం అధికారులు రూట్ క్లియర్ చేయడంతో సురక్షితంగా ల్యాండ్ అయింది.

పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.కాగా ఈ విమానంలో సుమారు 14 మంది శిక్షణ పొందుతున్న పైలట్లు ఉన్నారని తెలుస్తోంది.

తెలుగు డిజాస్టర్ సినిమాలతో వందల కోట్లు సంపాదిస్తున్న నిర్మాత.. ఏం జరిగిందంటే?