42 సెకన్లలో రూ.1.75 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. అదెలాగో తెలిస్తే..

అమెరికాలోని కాలిఫోర్నియా నగరానికి చెందిన ఒక టెక్ యూట్యూబర్ 42 సెకన్లలో రూ.

1.75 కోట్లు సంపాదించాడు.

వినడానికి ఇది నమ్మశక్యంగా లేనప్పటికీ ఇదే నిజం.సాధారణంగా లక్ష రూపాయలు సంపాదించాలంటేనే వారాలు లేదా నెలలపాటు కష్టపడాల్సి ఉంటుంది.

అలాంటిది ఒక టెక్ యూట్యూబర్ నిమిషం వ్యవధిలోనే దాదాపు రెండు కోట్లు సంపాదించడంతో అందరూ అవాక్కవుతున్నారు.

అదెలా సాధ్యం అయిందో ఇప్పుడు చూద్దాం.క్రిప్టో కరెన్సీ వంటి డిజిటల్ కరెన్సీ చాలా మందిని కోటీశ్వరులను చేసింది.

అలాగే డిజిటల్ ఆస్తి ద్వారా కూడా కష్టపడకుండానే చాలామంది బాగుపడ్డారు.ఇప్పుడు మనం చెప్పుకోబోయే జోనాథన్​ మా అనే ఓ యూట్యూబర్ కూడా డిజిటల్ ఆస్తిని అమ్ముకొని 42 సెకన్లలో రూ.

1.75 కోట్లు సంపాదించాడు.

'వ్యాక్సీడ్​ డాగ్​గోస్​' అనే పేరుగల నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ) కలెక్షన్లను అతడు విక్రయించి ఈ రేంజ్ లో డబ్బులు సంపాదించాడు.

అలా ఒక నైట్ లోనే కోటీశ్వరుడయ్యాడు.ఎన్‌ఎఫ్‌టీ అంటే డిజిటల్ ఆస్తి అనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే దీని వల్ల ఇంత లాభం ఉందా అని తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

ఇప్పుడు దీని గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.టెక్నాలజీ ఓ వ్యక్తి జీవితాన్ని ఎలా మార్చేస్తుందో మరోసారి నిరూపితమైందని నెటిజన్లు డిస్కస్ చేసుకుంటున్నారు.

"""/"/ ఈ వచ్చిన డబ్బుల్లో అన్ని ఖర్చులు పోను రూ.1.

40 కోట్లు మిగులుతాయని జోనాథన్​ చెబుతున్నాడు.ఈ డబ్బుతో మూవీ ప్రొడ్యూసర్ కావాలనే తన డ్రీమ్ నెరవేరుతుందని సంతోషపడుతూ చెబుతున్నాడు.

ఇతడు చాలా టాలెంటెడ్ వ్యక్తి.గతంలో ఫేస్​బుక్​, గూగుల్​ లాంటి దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్​వేర్ ఉద్యోగిగా కూడా వర్క్ చేశాడు.

అయితే వాటి ద్వారా సంతృప్తి పొందని ఇతను వినూత్నంగా ఆలోచించి కోట్ల రూపాయలు సంపాదించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అక్కడ దేవర ఐమ్యాక్స్ వెర్షన్ కు సైతం అదిరిపోయే రెస్పాన్స్.. తారక్ రేంజ్ వేరే లెవెల్!