సూట్‌కేస్‌తో ఇండియాకి వచ్చేసిన జపాన్ టెకీ.. ఏడాదిలో లైఫ్ మార్చేసిన 3 పాఠాలు..?
TeluguStop.com
"టెక్ జపాన్"( Tech Japan ) సంస్థ ఫౌండర్, నవోటకా నిషియామా( Naotaka Nishiyama ), ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు.
ఎందుకంటే ఆయన ఇండియాకి( India ) వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా, తన లైఫ్ ఎలా టర్న్ అయిందో చెప్తూ లింక్డిన్‌లో ఓ ఇన్‌స్పైరింగ్ పోస్ట్ పెట్టారు.
ఈ ఒక్క ఏడాదిలో వ్యాపారం, కల్చర్, పర్సనల్ గ్రోత్.ఇలా అన్నింటిపైనా తన ఆలోచనలు పూర్తిగా మారిపోయాయని ఆయన చెప్పారు.
ఆ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.సరిగ్గా ఏడాది క్రితం, 2024, మార్చిలో, నిషియామా టోక్యోను( Tokyo ) వదిలిపెట్టారు.
చేతిలో ఒక్క సూట్‌కేస్, గుండె నిండా కలలతో మార్చి 26న మన బెంగళూరులో( Bengaluru ) అడుగుపెట్టారు.
కొత్త దేశం, పరిచయాలు లేవు, ఏమీ తెలియదు.అయినా సరే, తన స్టార్టప్ ప్రయాణాన్ని ఇక్కడే మొదలుపెట్టారు.
"""/" /
ఇండియాలో ఒక జపనీస్ స్టార్టప్ ఫౌండర్‌గా, తను చాలా అరుదైన వ్యక్తి అని ఆయనకు త్వరగానే అర్థమైంది.
ఎందుకంటే, ఇక్కడ ఉన్న చాలామంది జపనీయులు పెద్ద పెద్ద కంపెనీల్లో అంటే ఆటోమొబైల్ (కార్లు), ఎలక్ట్రానిక్స్, బ్యాంకింగ్ లాంటి రంగాల్లో కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తుంటారు.
అందుకే చాలామంది ఆయన్ని చూడగానే, "మీరు టయోటాలో పనిచేస్తారా? లేక సుజుకీ నుంచా?" అని అడుగుతుంటారట.
దానికి ఆయన, "లేదు, నేను టాలెండీ ( Talendy ) అనే కంపెనీని స్థాపించాను, దాన్ని నడుపుతున్నాను" అని చెప్పినప్పుడు, చాలామందికి ఆ పేరు కూడా తెలిసి ఉండదట.
ఇదో కొత్త అనుభవం ఆయనకు.ఈ ఒక్క ఏడాదిలో, నిషియామా తన మైండ్‌సెట్‌ను పూర్తిగా మార్చేసిన మూడు కీలక పాఠాలను నేర్చుకున్నారట.
అవేంటో చూద్దామా? """/" /
H3 Class=subheader-style1.మార్పుకు సిద్ధపడటం ( Adapting To Change ):/h3p స్థిరంగా ఉండాలని కోరుకోవడం కంటే, నిరంతరం వస్తున్న మార్పుల ద్వారానే అసలైన విలువను సృష్టించవచ్చని నేర్చుకున్నారు.
అంటే, పరిస్థితులకు తగ్గట్టు మారడమే ఇక్కడ సక్సెస్ మంత్రం అన్నమాట.h3 Class=subheader-style2.
తట్టుకునే శక్తి ( Resilience ): /h3pఇండియా ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టం, కానీ అదే సమయంలో చాలా చురుగ్గా, శక్తివంతంగా ఉంటుందని గ్రహించారు.
ఈ ఊహించని తనం, ఈ చైతన్యమే తనలో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని నిలబడే శక్తిని పెంచిందట.
H3 Class=subheader-style3.యువత ఉత్సాహం ( Youthful Ambition ):/h3p ఇక్కడి యువతరంలో ఉన్న పాషన్, ఏదో సాధించాలనే తపన, ఎనర్జీ చూసి ఆయనకు ఎంతో స్ఫూర్తి కలిగిందట.
వాళ్ల ఉత్సాహమే తనను కూడా నిత్యం ముందుకు నడిపిస్తోందని చెప్పుకొచ్చారు."నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను, కానీ మనమందరం కలిసికట్టుగా భవిష్యత్తును నిర్మిద్దామని నమ్ముతున్నాను" అంటూ తన పోస్ట్‌ను పాజిటివ్‌గా ముగించారు నిషియామా.
ఆయన ధైర్యాన్ని, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపనను (ఓపెన్-మైండెడ్‌నెస్) మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు.
ఆయన పోస్ట్‌కు ఏకంగా 7,000కు పైగా రియాక్షన్లు, 400కు పైగా కామెంట్లు వచ్చాయంటే.
ఆయన స్టోరీ ఎంతగా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.
చిరంజీవి లైనప్ పెరిగిపోయిందా..? బాబీ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడా..?