సైంధవ్ నుండి మరో అప్డేట్.. కీలక పాత్రలో ఆ హీరోయిన్!
TeluguStop.com
టాలీవుడ్ లో ప్రజెంట్ సీనియర్ హీరోల్లో ఇద్దరు ఫుల్ ఫామ్ లో ఉంటే మరో ఇద్దరు రేసులో వెనుక ఉన్నారు.
బాలకృష్ణ, చిరంజీవి ఈ సంక్రాంతికి హిట్స్ కొట్టి తమ స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించు కున్నారు.
అయితే విక్టరీ వెంకటేష్, నాగార్జున మాత్రం రేసులో వెనుకబడి ఉన్నారు.వీరు కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు.
ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్లను నమ్ముకుని సినిమాలు చేస్తున్నారు. """/" /
వీరిలో విక్టరీ వెంకటేష్ ( Daggubati Venkatesh ) ప్రజెంట్ చేస్తున్న సినిమాపై అదిరిపోయే అంచనాలు ఉన్నాయి.
ఎందుకంటే ఈయన హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ( Sailesh Kolanu ) దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాను ప్రకటించాడు.
వెంకీ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమా అయిన 75వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''సైంధవ్''.
వెంకటేష్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తుండడం విశేషం.
"""/" /
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.
సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.కాగా ఈ సినిమాలో వెంకీకి జోడీగా కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్ ( Shraddha Srinath )ఫైనల్ అయ్యింది.
పవర్ ఫుల్ రోల్ లో వెంకీ నటిస్తున్నాడు.ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా నుండి వరుసగా పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆసక్తి పెంచేస్తున్నారు.
"""/" /
ఇక తాజాగా ఈ సినిమాలో మరొక బ్యూటీ భాగం అయినట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.
కోలీవుడ్ వెర్సటైల్ నటి ఆండ్రియా జెరెమియా 'జాస్మిన్' అనే కీలక రోల్ లో నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు.
గన్ పట్టుకుని ఉన్న ఈమె ఫస్ట్ లుక్ ఆకట్టు కుంటుంది.ఇక ఈ సినిమాలో వెంకటేష్ కు ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్దిఖీ ( Nawazuddin Siddiqui)నటిస్తున్నాడు.
శైలేష్ కొలను ఈ సినిమాతో వెంకటేష్ కు మంచి హిట్ ఇస్తాడని దగ్గుబాటి ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఇండియనే మొగుడుగా కావాలంట.. ఈ అమెరికన్ మహిళ వీడియో చూస్తే..