అనన్యతో ఒక ఆట ఆడుకున్న సుమ.. తెలుగు రాకపోవడంతో పంచుల మీద పంచులు?
TeluguStop.com
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే తాజాగా నటించిన చిత్రం లైగర్.
ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా చార్మి నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకులు ముందుకు రానున్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే.
కాగా విడుదల తేదీకి మరి కొద్ది రోజుల సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.
ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా దేశంలోని ప్రధాన నగరాలను సందర్శించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సినిమా కోసం టాలీవుడ్ తో బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతోంది.ఈ క్రమంలోనే తాజాగా యాంకర్ సుమ లైగర్ చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేసింది.
అందుకు సంబంధించిన ప్రోమో కూడా తాజాగా విడుదల చేశారు.కాగా అందులో విజయ్ దేవరకొండ,చార్మీ,పూరి,అనన్య,సుమ,అలాగే లైగర్ సినిమాలో విలన్ గా నటించిన వ్యక్తి వున్నారు.
"""/" /
ఈ క్రమంలోని ఇంటర్వ్యూలో భాగంగా నవ్వులు పూయించారు.కాగా యాంకర్ సుమ తనదైన శైలిలో వరుసగా అందరిపై పంచులు వేస్తూ మరింత నవ్వించింది.
ఈ క్రమంలోనే అనన్య పాండే నమస్తే సుమ మేడమ్ అని అనగా అయ్యో నేను మేడమ్ కాదు అని అనగా వెంటనే సుమ అని పిలుస్తుంది అనన్య పాండే.
ఆ తర్వాత వారందరూ కలిసి మైక్ టైసన్ గురించి కూడా చర్చించుకున్నారు.ఆ తర్వాత చివర్ లో సుమ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది అని అనన్య పాండే అని ప్రశ్నించగా.
ఆ ప్రశ్నకు అనన్య పాండే స్పందిస్తూ చాలా బాగుంది అనడంతో హమ్మయ్య సినిమా పూర్తి అయింది అంటూ అనన్య పాండే పై పంచులు వేసింది.
దీంతో సుమ పంచులు అర్థం కాక అనన్య బిక్క మొఖం వేస్తుంది.దాంతో పూరి జగన్నాథ్ విజయ్ చార్మిలు అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.
కాగా ఎందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Casino-Treueprogramme Bei Dafa Bet Casino: Ein Expertenguide Für Mobile Spieler