ఐసీసీ రాంకింగ్స్ లో ' టాప్ ' లేపిన టీమిండియా ఉమెన్స్..!

ర్యాకింగ్స్ లో నంబర్ 1గా కెప్టెన్ మిథాలీ రాజ్ అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు టీమిండియా మహిళా జట్టు వరుస విజయాలను నమోదు చేస్తోంది.

క్రికెట్ లో తన సత్తా చాటుతోంది.ప్లేయర్సు ఒక్కోక్కరూ తమ ప్రతిభను కనబరుస్తూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును పొందుతున్నారు.

తాజాగా టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ అయిన మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించిన వన్డే ర్యాకింగ్స్ లో తన సత్తాను చాటింది.

ఆమె మొదటి సారిగా తొలి స్థానాన్ని కైవశం చేసుకుంది.ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో మిథాలీ రాజ్ దూకుడుతనంతో బ్యాటింగ్ ఆడారు.

ఆమె అద్భుతమైన ప్రతిభ చూపినందుకు గాను మొదటి స్థానంలో నిలిచారు.దాదాపుగా చూస్తే 16 ఏళ్ల తరువాత టీమిండియా ఉమెన్స్ కెప్టెన్ మిథాలీ రాజ్ ఇలా మొదటి స్థానంలో నిలవడం ఎంతో గర్వించదగ్గ విషయం.

ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్ లో మిథాలీ రాజ్ తో పాటు టీమిండియా ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా మెరుగైన స్థానాన్ని పొందారు.

మిథాలీ రాజ్ తన 22 ఏళ్ల క్రికెట్ కెరీర్​లో 8వ సారి ఆమె మొదటి స్థానాన్ని సాధించారు.

ఇంకో టీమిండియా బ్యాటర్ ​స్మృతి మంధాన కూడా 701 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నారు.

మిథాలీ రాజ్ మాత్రం 762 పాయింట్లతో నాలుగు స్థానాలను కిందకి నెట్టి మొదటి స్థానంలో నిలవడం గర్వించదగ్గ పరిణామం.

"""/"/ ఇకపోతే టీ20 ర్యాంకింగ్స్​ను చూసినట్లైతే బ్యాటింగ్ లో టాప్ ​టెన్ లో ఇద్దరు టీమిండియా మహిళా క్రికెటర్లు ఉన్నారు.

అందులో షెఫాలీ వర్మ 776 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా స్మృతి మంధాన 693 పాయంట్లతో 4వ స్థానాన్ని కైవశం చేసుకున్నారు.

ఇకపోతే బౌలింగ్ లో దీప్తి శర్మ 705 పాయింట్లుతో 5వ స్థానం, రాధా యాదవ్​ 702 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచారు.

ఆల్​రౌండర్​ విభాగంలో చూసినట్లైతే దీప్తి శర్మ 304 పాయింట్లతో 5వ ర్యాంకును కైవశం చేసుకోవడం సంతోషించదగ్గ విషయం.

హోటల్ నోవాటెల్ లో బీభత్సం సృష్టించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎంత నష్టమో తెలుసా?