సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..

మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్( T20 World Cup ) ఫైనల్ మ్యాచ్‌ లో టీమిండియా ఘనవిజయం సాధించి రెండో సారి పొట్టి ప్రపంచ కప్ ను గెలుచుకుంది.

కేవలం 7 పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని సాధించి ప్రపంచ విజేతగా నిలిచింది.

ఎట్టకేలకు సుదీర్ఘ కాల నిరీక్షణ తర్వాత భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది.

ముఖ్యంగా మ్యాచ్ ను భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు.

దింతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానుల సంబరాలు మిన్నంటాయి.బార్బడోస్ గడ్డపై రోహిత్ సేన విజయకేతనాన్ని ఎగరవేసింది.

ముఖ్యంగా 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది.

చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్‌ లో 140 కోట్ల మంది భారతీయులు కలలను సాకారం చేసారు.

2007లో ఎంఎస్ ధోని సారథ్యంలో మొట్టమొదటి సీజన్ ను టీమిండియా ఛాంపియన్‌ గా నిలవగా.

మళ్లీ ఇన్నాళ్లకు పొట్టి ప్రపంచకప్ ను టీమిండియా గెలిచింది. """/" / దక్షిణాఫ్రికా( South Africa ) జట్టు 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చి ఆరంభాన్ని ఆశించిన స్థాయిలో చేయలేక పోయింది.

తనదైన శైలిలో జస్ప్రీత్ బుమ్రా తనదైన మార్క్ బౌలింగ్‌ లో 4 పరుగుల వద్ద హెండ్రిక్స్ రూపంలో మొదటి వికెట్‌ ను తీశాడు.

ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రామ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అర్ష్‌ దీప్‌ బౌలింగ్‌లో కీపర్ పంత్ చేతికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

ఇక ఇక్కడి నుంచి స్టబ్స్ 31 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును 70 పరుగుల వరకు చేర్చాడు.

క్వింటన్ డి కాక్‌ను తన వ్యక్తిగత స్కోరు 39 వద్ద అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేసినప్పటికీ, ఆ తర్వాత చెలరేగిన తుఫాన్‌ ను ఆపడం చాలా కష్టంగా మారింది.

ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ టీమిండియా స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ లను తీవ్రంగా లక్ష్యంగా చేసుకుని కేవలం 23 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు.

అల్లా సమరం సాగుతున్న సమయంలో 17వ ఓవర్లో క్లాసెన్‌ ను హార్దిక్ పాండ్యా అవుట్ చేయడం ద్వారా మ్యాచ్‌ కు ప్రాణం పోశాడు.

ఆపై అర్ష్‌దీప్ అద్భుతం చేశాడు.హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్‌ లోని మొదటి బంతికి డేవిడ్ మిల్లర్ క్యాచ్‌( David Miller ) ను సూర్యకుమార్‌ యాదవ్‌ తీసుకోవడంతో భారత్ విజయతీరాలకు చేరింది.

ఇక ఆ క్యాచ్ ను ఎంత వర్ణించిన తక్కవే.బహుశా క్రికెట్ చరిత్రలో అత్యంత కష్టతరమైన, విలువైన క్యాచ్ గా దానిని వారించవచ్చు.

ఇక చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సి ఉండగా హార్దిక్ పాండ్య అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు.

"""/" / ఇక నచ్ అనంతరం టీమిండియా దిగ్గజాలు కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు టి20 ఫార్మటుకు రిటైర్మెంట్ ప్రకటించడంతో భర్త అభిమానులు నిరాశ చెందారు.

టీమిండియా కప్ గెలవడంతో ప్రపంచ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!