చిన్నపిల్లలా మారిపోయిన టీమిండియా ఆటగాళ్లు.. ఎందుకంటే..?!
TeluguStop.com
ఎంత పెద్ద వారైనా.ఎన్ని పేరు ప్రఖ్యాతలు చెందిన వ్యక్తులైనా.
కొన్ని కొన్ని సందర్భాలలో ఆ పెద్దమనిషి కాస్తా చిన్నపిల్లాడిలా మారి ఎంజాయ్ చేయడం మనం అనేక సార్లు చూసి ఉంటాము.
అసలు విషయంలోకి వెళితే.తాజాగా టీమ్ ఇండియా జట్టు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో 3 -1 తేడాతో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
అయితే విజయాన్ని అందుకున్న టీమిండియా క్రికెటర్లు ఆ సక్సెస్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు.
నాలుగో టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోవడంతో మిగితా రెండు రోజుల సమయాన్ని కాస్తా టీమిండియా క్రికెటర్లు కిడ్స్ జోన్ లో తెగ ఎంజాయ్ చేస్తూ గడిపేశారు.
టెస్ట్ సిరీస్ లో టీమిండియా విజయానికి కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ అలాగే రిషబ్ పంత్ లతోపాటు టీ-20 జట్టు లో తాజాగా చోటు దక్కించుకున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అందరూ కలిసి చిన్న పిల్లల వలె మారిపోయి ఆడుకుంటూ అల్లరిచేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను శిఖర్ ధావన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.
ఈ పోస్టుకు శిఖర్ ధావన్."తాము ఎంత పెద్ద వాళ్లమైన బాల్యం పోకూడదు జీవితంలో పని చేయడం చాలా అవసరమని.
కానీ అప్పుడప్పుడు ఇలాంటివి చేయడం కూడా చాలా అవసరం అంటూ తెలిపాడు.వీటితో పాటు కుల్దీప్ యాదవ్ తన ఫస్ట్ రైడ్ నేర్చుకున్నట్లు కామెంట్ చేస్తూ పోస్ట్ చేశాడు శిఖర్.
ఇందుకు సంబంధించి టీమిండియా స్పిన్నర్ యాజ్వెంద్ర చాహాల్.నా రూమ్ నుండి ఇదంతా చూస్తున్నాం.
పిల్లల మస్తి.అంటూ కామెంట్ తెలియజేశాడు.
ఏది ఏమైనా టీమిండియా ఆటగాళ్లు ఇలా చిన్నపిల్లలలా ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌పై కంప్లైంట్.. ఎందుకంటే?