స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తమ బౌలింగ్‌తో న్యూజిలాండ్ వికెట్లను తక్కువ పరుగులకే తీయగలరని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా ఫాస్ట్ బౌలర్స్ అయిన మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మలతో టీమిండియా బరిలోకి దిగనుంది.
గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.ఇది భారత్‌కు ప్లస్ పాయింట్ కావచ్చు.
"""/"/
న్యూజిలాండ్ విషయానికొస్తే.ఈ జట్టు గత కొంత కాలంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తోంది.
లేటెస్ట్ టీ20 సిరీస్‌లో ఇండియా చేతిలో వైట్‌వాష్ అయినా.న్యూజిలాండ్ ని తక్కువ అంచనా వేయకూడదు.
ఆ టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆడలేదు.
కానీ ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో మాత్రం అతడు బరిలోకి దిగనున్నాడు.మిడిలార్డర్‌లో దిగనున్న విలియమ్సన్‌ను త్వరగా ఔట్ చేస్తే.
భారత్‌కు గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.కేన్ విలియమ్సన్‌తో పాటు టామ్ లాథమ్ కూడా మంచి జోరుమీద ఉన్నాడు.
ఇతడు కూడా భారత బౌలర్లను ఉతికారేసే అవకాశాలు ఎక్కువ.ఓపెనర్లుగా బ్యాటర్ టామ్ లాథమ్, డెరిల్ మిచెల్ దిగే అవకాశం ఉంది.
మిచెల్ శాంట్నర్, అజాజ్ పటేల్, జెమీసన్, నీల్ వాగ్నర్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్(వికెట్ కీపర్), టిమ్ సోధి వంటి టాలెంటెడ్ ప్లేయర్లతో కివీస్ ఈ టెస్ట్ మ్యాచ్‌లో ఆడనుంది.