రిటైర్మెంట్‌ సంకేతాలిచ్చిన టీమిండియా క్రికెటర్.. వీడియో వైరల్

వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఫామ్ కోల్పోయినా తిరిగి దినేష్ కార్తీక్ తనదైన ప్రతిభతో అందరినీ అలరించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 యొక్క ప్లేఆఫ్‌కు చేరుకోవడంలో అతడి ఆటతీరు ఎంతో సాయపడింది.

లోయర్ ఆర్డర్‌లో వచ్చి చేజారిపోయిన ఎన్నో మ్యాచ్‌లను గెలుపు తీరాలకు చేర్చాడు.

ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం తన 'కల' అని దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

ఇక అతడి వయసు 37 ఏళ్లు ఉన్నప్పటికీ అతడి ఫామ్ దృష్ట్యా టీ20 వరల్డ్ కప్‌ జట్టులో చేరాడు.

అయితే భారత్ సెమీ ఫైనల్‌లోనే నిష్క్రమించింది.ఈ తరుణంలో వయసు రీత్యా అతడు టీమిండియా నుంచి రిటైర్ అయ్యే టైమ్ వచ్చిందని భావించాడు.

తన రిటైర్మెంట్‌ ఉందని సంకేతాలిస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఉద్వేగభరితమైన వీడియోను పోస్ట్ చేశాడు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/"/ దినేష్ కార్తీక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ వీడియోను బుధవారం పోస్ట్ చేశాడు.

తన కెరీర్‌లో తనకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపాడు.టీ20 ప్రపంచ కప్‌కు ఎంపిక కాక ముందు ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో దినేష్ అద్భుత ఆటతీరు కనబర్చాడు.

దీంతో ఫినిషర్ పాత్రకు టీ20 జట్టుకు అతడిని సెలెక్టర్లు ఎంపిక చేశారు.అయితే ప్రస్తుతం అతడి వయసు 37 ఏళ్లు రావడం, వికెట్ కీపింగ్ పాత్ర కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది.

టీ20 వరల్డ్ కప్‌లో అతడిపై చాలా అంచనాలు పెట్టుకున్నారు.అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో అతను కేవలం ఒక పరుగుకే ఔటయ్యాడు.

దక్షిణాఫ్రికాపై 15 బంతుల్లో ఆరు పరుగులు చేశాడు.ఈ క్రమంలో అతడికి భవిష్యత్తులో అవకాశాలు రాకపోవచ్చు.

ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్‌పై సంకేతాలిస్తూ తాజా పోస్ట్ చేశాడు.దినేష్ కార్తీక్ తన కెరీర్‌లో 26 టెస్టులు ఆడి 1025 పరుగులు చేశాడు.

94 వన్డేలు ఆడి 1752 పరుగులు సాధించాడు.ఇక అంతర్జాతీయ టీ20లలో 60 మ్యాచ్‌లకు భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించి 686 పరుగులు చేశాడు.

బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టును పెంచుతుంది.. ఎలాగంటే?