రహానెకి అండగా నిలిచిన విరాట్ కోహ్లీ.. వారికి చురకలు!

ఒకప్పుడు అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా విజయాలకు కారణమైన అజింక్య రహానె ఇప్పుడు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు.

న్యూజిలాండ్ టీంతో ఇటీవల జరిగిన తొలి టెస్టులో రహానె కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు.

టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన రహానె ఆ రేంజ్ లో విఫలం కావడం విమర్శలకు తావిచ్చింది.

రెండో టెస్టులో కోహ్లీ టీమ్ లోకి రావడం.శ్రేయస్ అయ్యర్  అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రహానెని పక్కనపెట్టేసింది టీమిండియా.

అయితే టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ రహానెకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.

విజయానంతరం కోహ్లీ మాట్లాడుతూ."రహానె ఫామ్ గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు.

అతన్ని జడ్జ్ చేయడం సరైనది కాదు.నేనే కాదు ఎవరూ కూడా చేయలేరు.

సరిగ్గా  ఆడకపోవడానికి ఏ అడ్డంకులు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించే అంశంపై దృష్టి సారిస్తే సరిపోతుంది.

అది రహానె లేదా ఏ ఆటగాడైనా కావచ్చు.కీలక మ్యాచులలో అద్భుత ప్రదర్శనతో జట్టును విజయ తీరాల వైపు నడిపించగల  ఆటగాళ్లకు కష్టకాలంలో మద్దతుగా నిలబడాలి" అని చెప్పుకొచ్చారు.

కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలకు ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు. """/" / కీలక ఆటగాళ్ళందరూ విఫలమైనప్పుడు ఎన్నోసార్లు రహానె ఒంటి చేత్తో టీమ్ ఇండియాని గట్టెక్కించిన సందర్భాలున్నాయి.

అవన్నీ మర్చిపోయి ఫామ్ లో లేనప్పుడు విమర్శలు చేయడం సరికాదని కోహ్లీ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

అయితే రహానెపై దారుణమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి.విమర్శకులకు కూడా కోహ్లీ చురకలంటించారు.

బయట వ్యక్తులు, విమర్శకులు ఆటగాళ్లను జడ్జ్ చేస్తున్నా సరే వారి గురించి మేం మాటలు పట్టించుకోము.

"""/" / మా మద్దతు ప్రతీ ఆటగాడికి ఒకేలా ఉంటుంది.బయట పరిస్థితులు ఆధారంగా ఒక వ్యక్తిని జట్టులో ఉంచుకోవాలా లేదా అనేది మేం అసలు నిర్ణయించం" అని చెబుతూ కోహ్లీ అనవసరంగా నోరుపారేసుకున్న వారికి సున్నితంగా చురకలంటించారు.

దాదాపు 80 టెస్టు మ్యాచుల్లో ఆడిన రహానె 12 సెంచరీలు 24 అర్థ సెంచరీలు సాధించాడు.

వన్డేల్లో కూడా 111 అత్యధిక స్కోరు తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.ఐపీఎల్లో ఏకంగా రెండు సెంచరీలు సాధించి తన సత్తా ఏంటో చాటాడు.

మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ సవాల్..!!