టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా లగ్జరీ లైఫ్.. వీడియో వైరల్
TeluguStop.com
ప్రపంచంలోనే ధనికమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకు పేరుంది.ఇక భారత క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లకు లెక్కకు మించి డబ్బులు వచ్చి పడుతుంటాయి.
భారత జట్టుకు ఎంపికైన క్రికెటర్లకు, ఐపీఎల్‌లో ఆడే క్రికెటర్లకు కాసుల వర్షం కురుస్తోంది.
దీంతో ఐపీఎల్‌లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు సైతం బాగా ఆసక్తి చూపుతుంటారు.ఇక భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవల కాలంలో చెలరేగి ఆడుతున్నాడు.
కొంత కాలం క్రితం వెన్ను నొప్పి కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడు.ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్‌లో గుజరాత్ జట్టుకు సారథ్యం వహించడంతో పాటు, దానిని ఏకంగా విజేతగా నిలిపాడు.
ఇక భారత జట్టులోకి పునరాగమనం చేసి, తానెంత విలువైన ఆటగాడో నిరూపిస్తున్నాడు.ఇటువంటి తరుణంలో తాజాగా అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఆసియా కప్ 2022 దగ్గర్లో ఉంది.
ఆగస్టు 28న పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.దీనికి ముందు భారత ఆటగాళ్లు బాగా సేదదీరుతున్నారు.
ఈ తరుణంలో లగ్జరీ లైఫ్ గడిపే భారత క్రికెటర్లు కుటుంబంతో కలిసి విహార యాత్రల్లో మునిగి తేలుతున్నారు.
ఇక లగ్జరీ లైఫ్ గడపడంలో హార్దిక్ పాండ్య తీరే వేరు. """/" /
అతను తన భార్య నటాషా మరియు కొడుకు అగస్త్యతో ఆనందిస్తూ కనిపిస్తాడు.
జూలై 30న అగస్త్యకు రెండేళ్లు.హార్దిక్ మరియు నటాషా తమ కొడుకు పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకోవడానికి ఇది కూడా ఒక కారణం.
ఇక హార్దిక్ విడుదల చేసిన వీడియోలో అతడు గడిపే లగ్జరీ లైఫ్ కనిపిస్తుంది.
ముఖ్యంగా ప్రైవేట్ జెట్‌లో వెళ్లి, భార్య-కుమారుడితో కలిసి బీచ్‌లో తిరగడం, తిరిగి ఆ ప్రైవేట్ జెట్‌లోనే తిరగడం కనిపిస్తుంది.
స్విమ్మింగ్ పూల్ వద్ద ఎంతో దర్జాగా ఫొటోలు దిగాడు.ఈ వీడియో పోస్ట్ చేయగానే లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి.
సుకుమార్ కావాలనే రామ్ చరణ్ కోసం అలాంటి కథను రెడీ చేశాడా..?