సివిల్స్ ర్యాంక్ సాధించిన ఈ టీం ఇండియా క్రికెటర్ తెలుసా.. చదువులో కూడా టాపర్ అంటూ?
TeluguStop.com
అటు చదువు ఇటు ఆటల్లో సక్సెస్ సాధించాలంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.
అయితే కొందరు మాత్రం ఈ రెండు రంగాల్లో సక్సెస్ సాధించి సత్తా చాటుతుంటారు.
యూపీఎస్సీలో సివిల్( Civil In UPSC ) ఎగ్జామ్ అత్యంత కఠినమైన పరీక్ష కాగా ఈ పరీక్షలో సత్తా చాటాలంటే ఎంతో కృషి చేయాలి.
ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు సివిల్ పరీక్ష రాస్తుండగా వీళ్లలో ఉత్తీర్ణులు అవుతున్న వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు.
అయితే మాజీ ఇండియా క్రికెటర్( Former India Cricketer ) ఒకరు సివిల్ ర్యాంక్ సాధించారనే విషయం చాలా తక్కువమందికి తెలుసు.
ఈ విషయం నెటిజన్లను ఒకింత ఆశ్చర్యానికి సైతం గురి చేస్తుంది.మాజీ క్రికెటర్ అమే ఖురేషియా( Amay Khaurasiya ) ఆటలతో సమానంగా చదువులో కూడా రాణించి సత్తా చాటారు.
క్రికెట్ లో అడుగుపెట్టడానికి ముందే సివిల్స్ క్లియర్ చేసిన ఘనత ఖురేషియా సొంతం అని చెప్పవచ్చు.
"""/" /
ఖురేషియా ప్రస్తుతం కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు.
17 సంవత్సరాల వయస్సులో ఖురేషియా క్రికెట్ లో ఆరంగేట్రం చేశారు.క్రికెట్ తో ఎంత బిజీగా ఉన్నా చదువును మాత్రం ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
సివిల్స్ క్లియర్ చేసిన కొన్నిరోజులకే జాతీయ జట్టు నుంచి ఖురేషియాకు పిలుపు రావడం గమనార్హం.
దేశం కోసం ఆడాలన్న కలను నిజం చేసుకున్న ఖురేషియా ఎంతో సంతోషించారు.డెబ్ల్యూ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేసిన ఈ క్రికెటర్ తర్వాత రోజుల్లో ఆటకు దూరమయ్యారు.
టీమిండియా తరపున 12 వన్డేలలో ఖురేషియా ఆడారు.ఖురేషియా 7000కు పైగా పరుగులు చేసి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారు.
ఈ టీం ఇండియా క్రికెటర్ గురించి షాకింగ్ విషయాలు తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ప్లాన్..అతి తక్కువ ఖర్చుతో ఏకంగా 180 రోజుల వ్యాలిడిటీ