వీడియో వైరల్: డాన్స్ తో భారత అభిమానులను ఫిదా చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు..!
TeluguStop.com
ఇవాళ న్యూజిలాండ్‌తో జరగనున్న కీలకమైన మ్యాచ్‌కు ముందు టీమిండియా జట్టు సరదాగా గడిపింది.
శనివారం ప్రాక్టీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు తమ భార్యా పిల్లలతో కలసి హాలోవీన్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు.
వారి వేడుకలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
వీటిలోని ఓ వీడియోలో హిట్టర్ ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించారు.
ఈ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.అత్యంత ఇంపార్టెంట్ మ్యాచ్‌కు ముందు ఎలాంటి ఒత్తిడి లేకుండా భారత క్రికెటర్లు ఎంజాయ్ చేయడం ఒకందుకు మంచిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అయితే అభిమానులు మాత్రం తమకు ఇష్టమైన ఆటగాళ్లను కొత్త అవతారంలో చూసి ఫిదా అయిపోతున్నారు.
ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసి డాన్స్ వేసిన తీరును మెచ్చుకుంటున్నారు.
ఈ వీడియోల్లో విరాట్ కోహ్లీ వేడుకలను షూట్ చేస్తూ కనిపించారు.బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి.
"""/"/
ఇదిలా ఉండగా ఈరోజు జరగనున్న న్యూజిలాండ్, టీమిండియా మ్యాచ్ పై టీమిండియా ఫ్యాన్సీ భారీస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ఈ మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా కూడా చాలావరకు ఊపిరి పీల్చుకుంటుంది.ఇందుకు కారణం ఈ డూ ఆర్ డై మ్యాచ్ ఏ జట్టు సెమీఫైనల్‌కు వెళ్తుంది అనేది నిర్ణయిస్తుంది.
ఐతే న్యూజిలాండ్ జట్టు చాలా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
నిన్న మధ్యాహ్నం వరకు కఠినమైన ప్రాక్టీస్ లో మునిగితేలిన కోహ్లీసేన ఈరోజు ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.
షాకింగ్: అడుక్కునే వ్యక్తి చేతిలో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్.. ఎలా కొన్నాడో వినండి?