హెడ్ మాస్ట‌ర్ పోస్టు కోసం త‌న్నుకున్న టీచ‌ర్లు..

టీచ‌ర్లు అంటే బుద్ధులు చెప్పే గురువుల స్థానంలో ఉండేవారు.ఒక త‌రాన్ని స‌క్ర‌మంగా న‌డిపించాలంటే వారితోనే సాధ్యం అవుతుంది.

ఎలాంట న‌డ‌వ‌డికి నేర్పించాల‌న్నా కూడా వారితోనే సాధ్యం అవుతుంది.అందుకే చ‌దువుకున్న వారికి సంస్కారం క‌చ్చితంగా ఉంటుంది.

కానీ ఉద్యోగ రీత్యా ఎవ‌రైనా స‌రే ప్ర‌మోష‌న్లు కావాల‌ని కోరుకుంటారు.మ‌రి టీచ‌ర్లు కూడా ఇందుకు అతీతం కాదు క‌దా.

అందుకే వారు కూడా ఇంకా పెద్ద స్థాయిలో ఉండాల‌ని కోరుకుంటారు.ఇక ప్ర‌మోష‌న్ల విష‌యంలో ఒకరితో ఒక‌రు పోటీ ప‌డ‌టం అనేది స‌ర్వ సాధార‌ణం.

ఇందుకోసం ఉద్యోగుల మధ్య గ్రూపు రాజకీయాల‌తో పాటు పెద్ద ఎత్తున పైరవీలు కూడా న‌డుస్తాయ‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే.

కొన్ని సార్లు సీనియారిటీని చూసి ప్రమోషన్ వ‌రిస్తుంద‌ని భావించినా కూడా ఇంకొన్ని సార్లు ప్రభుత్వ పెద్దల మ‌ద్ద‌తు ఉంటే ఈజీగా పై స్థాయికి వెళ్లొచ్చు.

కానీ ఓ ఇద్ద‌రు టీచ‌ర్లు ఏకంగా ప్ర‌మోష‌న్ల కోసం విప‌రీతంగా కొట్టుకున్నారు.ఈ విష‌యం విన‌డానికి కూడా కొంత ఆశ్చ‌ర్యం క‌లిగించినా కూడా ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.

పాట్నాలో ఉండే విద్యాశాఖ ఆఫీసులో ఇద్దరు టీచ‌ర్లు ఇలా అంద‌రూ చూస్తుండ‌గానే కొట్టుకున్నారు.

"""/"/ ఆదాపూర్లో ఉండే ఓ గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్‌లోని హెడ్ మాస్ట‌ర్ పోస్టు ఖాళీగా ఉంది.

దీంతో దీని కోసం శివశంకర్ గిరి అనే వ్యక్తితో పాటు రింకీ కుమారి అనే మహిళా టీచ‌ర్ ఇద్ద‌రూ కూడా విప‌రీతంగా పోటీ ప‌డుతున్నారు.

ఇద్ద‌రూ త‌న‌కే కావాలంటూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు కూడా చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీంతో అధికారులు ఇద్దరినీ విద్యాశాఖ కార్యాలయానికి పిలిపించారు.ఇద్ద‌రి స్ట‌డీ స‌ర్టిఫికెట్ల‌ను ప‌రిశీలించేందుకు ర‌మ్మ‌న‌గా ఇద్ద‌రూ వ‌చ్చి గొడవ ప‌డ్డారు.

ఏకంగా ఒక‌రిపై ఒక‌రు కొట్టుకునే దాకా వెళ్లింది.రింకీ కుమారి భర్త ఆగ్ర‌హంతో మ‌రో టీచ‌ర్ పై దారుణంగా దాడి చేశాడు.

దీంతో ఇప్పుడు ఈ ఇద్ద‌రు టీచ‌ర్ల పై చర్యలు తీసుకోనున్నారు ఆఫీస‌ర్లు.

ప్రభాస్ సినిమాల్లో వాళ్ల అమ్మకి బాగా నచ్చిన సినిమా ఏంటో తెలుసా..?