మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి టీచర్లు షాక్..!!

మహమ్మారి కరోనా నేపథ్యంలో మొన్నటి వరకు పాఠశాలలు క్లోజ్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం చాలా వరకు సాధారణ పరిస్థితి రావడంతో పాటు వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడం మరోపక్క కేసులు కూడా తగ్గటంతో దేశంలో చాలా రాష్ట్రాలలో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి.

ఇదే రీతిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ అయిన తరుణంలో.పాఠాలు చెప్పాల్సిన టీచర్లు రోడ్లపై నిరసనలు చేపడుతున్నారు.

"""/" / విషయంలోకి వెళితే 2018 వ సంవత్సరం లో ఐదు వేల మంది.

ప్రభుత్వ టీచర్లు గా ఎంపికయ్యారు.అయితే అప్పటి నుండి వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి రాలేదు.

దీంతో సెలెక్ట్ అయ్యి ఇప్పటివరకు ఖాళీగా ఉన్న ఆ అయిదు వేల మంది టీచర్లు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో రోడ్లపైకి వచ్చి బిజెపి కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శనలు చేశారు.

అన్ని రకాలుగా సెలెక్ట్ అయిన గానీ ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకపోవడం పై.

మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతూ రోడ్లపై టీచర్లు బైటాయించడం జరిగింది.

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్..!!