సమాజాన్ని చీకట్ల నుంచి వెలుగులోకి తెచ్చేవారే ఉపాధ్యాయులు:ప్రభుత్వ విప్ బీర్ల
TeluguStop.com
యాదాద్రి భువనగిరి జిల్లా:సమాజాన్ని చీకట్ల నుంచి వెలుగులోకి తెచ్చేవారే ఉపాధ్యాయులని ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీర్ల ఐలయ్య,పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజాన్ని చికట్లో నుండి వెలుగులోకి తెచ్చే ఉపాధ్యాయులను సన్మానించడం నిజంగా అదృష్టంగా ఉందన్నారు.
కరిగే కొవ్వత్త్ములాగా ఉపాధ్యాయిలు తమ విజ్ఞానాన్ని పంచి సమాజానికి వెలుగులు అందిస్తున్నారని,నేటి విధ్యా విదానంలో విద్యార్థులకు మీలాంటి ఉపాద్యాయిలు మార్గదర్శనం ఎంతో అవసరమన్నారు.
తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం సమాజం ఉపాధ్యాయులకు ఇచ్చిందన్నారు.తలరాతలు రాసేది బ్రహ్మ అయితే మ ఒడి రాతలు రాయించి భవిష్యత్ కి బంగారు బాటలు వేసేది ఉపాద్యాయులన్నారు.
సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?