టీచర్ పాట పాడుతుండగా బెంచ్‌పై వాయించిన విద్యార్థి.. ఎంత అద్భుతంగా ఉందంటే..?

ఏదైనా సాంగ్ ( Song ) విన్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా డ్యాన్స్ వేస్తూ ఉంటాం.

మన కాళ్లను కడపడం లేదా చేతులను ఆడించడం లాంటివి చేస్తూ ఉంటాం.అలాగే ఏదైనా పాట వస్తున్నప్పుడు ఆ పాటను మనం పాడటం లేదా మనస్సులో పాడుకోవడమో చేస్తూ ఉంటాం.

అలాగే కొంతమంది పాటలకు దరువు వేస్తూ ఉంటారు.ఏదైనా పాట విన్నప్పుడు ఏదైనా టేబుల్ మీద లేదా ఇంకా ఏదైనా వస్తువు ఉపయోగించి దరువు వేస్తూ ఉంటాం.

కొంతమంది పాటకు తగ్గట్లు దరువు వేసి తమ ప్రతిభను చాటుకుంటూ ఉంటారు. """/" / తాజాగా ఒక బాలుడు అద్భుతంగా దరువు వేశాడు.

స్కూల్‌లో టీచర్ ( Teacher ) పాటలు పాడుతుండగా.ఆమె పక్కన బల్లపై కూర్చోని దరువు వేశాడు.

పాటకు తగ్గట్లుగా డప్పు వాయించాడు.బాలుడి డప్పు అద్భుతంగా ఉంది.

దీంతో అతడి టాలెంట్ చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.కేరళలోని( Kerala ) ఒక ప్రభుత్వ పాఠశాలలో ఇది చోటుచేసుకుంది.

కేరళలోని వయనాడ్‌లోని ఒక గవర్నమెంట్ స్కూల్‌లో అంజనా కుమార్( Anjana Kumar ) అనే టీచర్ జానపద గీతాన్ని క్లాస్ రూమ్ లో ఆలపించింది.

విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు ఆమె పాటలు పాడింది. """/" / ఈ క్రమంలో టీచర్ పాట పాడుతుండగా.

అభిజిత్ ( Abjijeet ) అనే ఒక స్టూడెంట్ ఆమె పాటకు అనుగుణంగా డప్పు వాయించాడు.

అతడి దరువుకు తోటి విద్యార్థులు కూడా ఆశ్చర్యపోయారు.క్లాచ్ టీచర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.

అభిజిత్ ప్రతిభ అందరికీ తెలిసింది.పోస్ట్ చేసిన కేవలం 24 గంటల్లోనే వీడియోకు లక్షకుపైగా లైక్స్ వచ్చాయి.

ఈ వీడియోకు నెటిజన్లు స్పందిస్తూ.మట్టిలో మాణిక్యం అని, ఇలాంటి వారి టాలెంట్ ను ఉపయోగించుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు సెలబ్రెటీలు కూడా ప్రశంసిస్తున్నారు.

తొలి ప్రయత్నంలోనే సీఏ పరీక్షలో రెండో ర్యాంక్.. ఈ యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!