యూనిఫాంలో మలవిసర్జన చేశాడని.. ఒంటిపై వేడి నీళ్లు పోసిన ఉపాధ్యాయుడు!

ఉపాధ్యాయులు చిన్న పిల్లలను కొట్టొద్దని ప్రభుత్వం పదే పదే మొత్తుకుంటున్నా కొందు టీచర్లు మాత్రం తమ తీరుని మార్చుకోవడం లేదు.

కోపం వచ్చిన వెంటనే దాన్ని పిల్లలపై చూపించి తెగ హింసించేస్తున్నారు.ఈ మధ్య ఉపాధ్యాయుల దెబ్బలకు తట్టుకోలేక చాలా మంది పిల్లలే చనిపోయారు.

అయితే తాజాగా ఓ టీచర్ దారుణం బయట పడింది.యూనిఫాం డ్రెస్సులో మల విసర్జన చేసుకున్నాడని.

తీవ్ర కోపోద్రిక్తుడైన ఓ టీచర్ ఆ విద్యార్థిని విపరీతంగా కొట్టాడు.అనంతరం అతడిపై వేడి నీళ్లీ పోసి అరాచకం సృష్టించాడు.

దీంతో బాలుడి శరీరం 40 శాతం కాలిపోయింది.అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటక రాయ్ చూర్ లో అమానవీయ ఘటన జరిగింది.యూనిఫాంలో మల విసర్జన చేశాడని ఓ విద్యార్థి పట్ల దారుణంగా ప్రవర్తించాడు.

విద్యార్థి శరీరంపై వేడి నీళ్లు పోసేశాడు.దీంతో ఆ చిన్నారి శరీరం 40 శాతం కాలిపోయింది.

సంతకళ్లూరులోని శ్రీగణమాతేశ్వర ప్రైమరీ పాఠశాలలో బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు.ప్రస్తుతం తీవ్రంగా గాయపడిన బాలుడు లింగసుగూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్డనాడు.

సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాలుడిపై దాడికి పాల్పడిన రోజు నుంచి ఉపాధ్యాయుడు హుళిగెప్ప పాఠశాలకు రావట్లేదని సమాచారం.

ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా.ఉపాధ్యాయుడిపై మాత్రం ఇంకా కేసు నమోదు కాలేదు.

అతడిపై ఫిర్యాదు చేయవద్దని టీచర్ తరఫు పెద్ద మనుషులు బాలుడి తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.