వైరల్ వీడియో.. పరీక్షలో రాసిన సినిమా డైలాగ్ కు ఫుల్ మార్క్స్ వేసిన టీచర్..

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలోని విశేషాలు క్షణాల్లో మన ముందుకు వస్తున్నాయి.

అందులో కొన్ని ఆశ్చర్యం కలిగిస్తే, మరికొన్ని హాస్యంతో మనలను నవ్విస్తుంటాయి.అలాంటి ఆసక్తికరమైన ప్రస్తుతం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.

ఇకపోతే, పరీక్షల్లో( Exams ) కొన్ని సార్లు జవాబు గుర్తుకు రాకపోతే ఏదో ఒకటి రాయడం మనందరికీ తెలుసు.

కొంతమంది ఊహాకథలు రాస్తే, మరికొంతమంది సినిమా డైలాగ్స్( Movie Dialogue ) రాస్తుంటారు.

తాజాగా ఒక విద్యార్థి చేసిన సంఘటన నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. """/" / ఓ పరీక్షలో విద్యార్థి తన ఆన్సర్ షీట్‌లో ఓ పాపులర్ సినిమా డైలాగ్ రాశాడు.

పేపర్ చూసిన టీచర్ మొదట షాక్ అయ్యాడు.కానీ, ఆ డైలాగ్‌ను చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు.

ఈ క్షణాన్ని వీడియోలో భద్రపరచాలని భావించి పక్కన ఉన్న వ్యక్తిని వీడియో తీయమని కోరాడు.

అక్కడ ఏముందో అతను చదవడం మొదలు పెట్టాడు.ఆ కుర్రాడు.

"అందరూ నువ్వు ఫెయిల్ కావాలని ఎదురు చూస్తున్నప్పుడు.విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు కదా.

" అని రాసాడు.అయితే, ఆ తర్వాత ఆశ్చర్యకరంగా, ఆ డైలాగ్‌కు ఫుల్ మార్కులు కూడా వేశాడు.

అంతేకాదండోయ్.పరీక్షకు సంబంధించి 80 మార్కులకు గాను 80 మార్కులు ఇచ్చాడు.

"""/" / ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కొందరు టీచర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌ను మెచ్చుకోగా, మరికొందరు ఇలాంటి స్టూడెంట్స్ యథార్థంగా పరీక్షకు ప్రిపేర్ కావాలని సూచిస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసాక మీకేమనిపించిందో ఓ కామెంట్ చేయండి.