'వధువు కావలెను' అంటూ ఏకంగా బోర్డు పెట్టాడు..దీంతో చివరకు..!

వరుడు కావలెను.వధువు కావలెను.

ఇలాంటి ప్రకటనలు మనం పేపర్లో చూసే ఉంటాం.కానీ ఒక వ్యక్తి మాత్రం తన షాప్ కు ఎదురుగా 'వధువు కావేలెను' అని బోర్డు పెట్టడమే కాకుండా తన ఫోన్ నెంబర్ వేసి కులం మతంతో కూడా సంభంధం లేదని ఆ బోర్డు లో రాసి షాప్ కు ఎదురుగా పెట్టడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

ఆ షాప్ కు వచ్చిన వ్యక్తి ఆ బోర్డు ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన కేరళ లోని త్రిచూర్ లో జరిగింది.అక్కడే నివసించే ఉన్ని కృష్ణన్ అనే వ్యక్తి తన పెళ్లి కోసం ఇలా చేసాడు.

అతడు పెళ్లి కోసం పెళ్లిళ్ల పేరయ్యను కలవకుండా డైరెక్ట్ గా ఇలా తన షాప్ ఎదురుగా ఇలా బోర్డు పెట్టాడు.

అతడిది టీ స్టాల్.ఆ టీ స్టాల్ ఎదురుగా అతడు వధువు కావాలి.

కులం మతం తో ఏమాత్రం సంభంధం లేదు.అని ఫోన్ నెంబర్ కూడా అందులో పొందు పరిచాడు.

ఈ బోర్డు ను అతడి ఫ్రెండ్ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

అది వైరల్ అవ్వడమే కాకుండా అతడికి షాక్ కూడా తగిలేలా చేసింది.ఎందుకు షాక్ అయ్యాడంటే అతడికి పెళ్లి సంభంధం కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి కూడా కాల్స్ రావడంతో అతడు షాక్ అయ్యాడట.

ఈ విషయంపై అతడు స్పందించాడు. """/"/ అతడు మాట్లాడుతూ.

నాకు 33 సంవత్సరాలు.నా తలలో కణతి ఉండడంతో సర్జరీ జరిగి ఇప్పుడు కోలుకున్నాను.

ఒక లాటరీ తగలడంతో నేను టీ స్టాల్ పెట్టుకున్నాడు.అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను.

నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ చుసిన సంబంధాలు సెట్ అవ్వడం లేదని ఇలా నా టీ స్టాల్ ముందు బోర్డు పెట్టాను.

అని ఉన్ని కృష్ణన్ చెప్పుకొచ్చాడు. """/"/ ఈ బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అతడికి పెళ్లి కోసం రోజు చాలా కాల్స్ వస్తున్నాయట.

అతడి పూర్తి వివరాలు కూడా అడుగుతున్నారని ఉన్ని కృష్ణన్ తెలిపాడు.కొంతమంది ఇతడికి సపోర్ట్ చేస్తుంటే.

మరి కొంతమంది మాత్రం ఇలా సోషల్ మీడియాలో వధువును ఎవరైనా వెతుకుంటారా అని కామెంట్స్ చేస్తున్నారు.

మరి చూడాలి ఉన్ని కృష్ణన్ కు తనకు కావాల్సిన వధువు దొరుకుతుందో లేదో.

కోచింగ్ కు డబ్బులు లేకపోయినా 7 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంతోష్.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!