రేవంత్ కోసం చంద్రబాబు పెద్ద త్యాగమే చేస్తున్నారే

టీడిపి అధినేత చంద్రబాబు వైఖరిపై కొద్ది రోజులుగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.తెలంగాణలో టిడిపి ఎన్నికలకు దూరంగా ఉండడం,  పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు చేకూర్చే విధంగా వ్యవహరిస్తూ ఉండడం వంటివి చర్చనీయాంసంగా మారాయి.

తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందని ప్రకటించడమే కాకుండా,  అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసుకుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయిన విషయం తెలిసిందే.

  చంద్రబాబు అభ్యర్థులను పోటీకి దించే విషయంలో వెనకడుగు వేయడంతో,  కాసాని తీవ్ర అసంతృప్తి చేస్తూ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసింది .

టిడిపికి కొన్ని నియోజకవర్గాల్లో గట్టిపట్టు ఉండడం,  స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో  చంద్రబాబు అరెస్ట్ కావడంతో వచ్చిన సానుభూతి ఇవన్నీ కొన్ని నియోజకవర్గాల్లోనైనా ప్రభావం చూపి కొన్ని సీట్లలోనైనా విజయం సాధిస్తుందని అంతా అంచనా వేశారు.

చంద్రబాబు మాత్రం టిడిపిని పోటీకి దించేందుకు ఇష్టపడడం లేదు.అయితే ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చేలా చేస్తే , రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు అంచనా వేస్తున్నారట.

మొదటి నుంచి బీఆర్ఎస్ అధినేత,  తెలంగాణ సీఎం కేసీఆర్ టిడిపి,  చంద్రబాబు విషయంలోనూ కక్షపూర్తంగా వ్యవహరిస్తుండడం, పరోక్షంగా జగన్ కు మేలు చేసేందుకు కేసిఆర్ ప్రయత్నిస్తూ ఉండడం వంటివి దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే,  రేవంత్ ముఖ్యమంత్రి అయితే, ఏపీలో ఆ ప్రభావం కనిపిస్తుందని , టిడిపి విజయానికి ఇబ్బందులు ఉండవని చంద్రబాబు అంచనా వేస్తున్నారట .

అందుకే తెలంగాణలోని క్రమ సామాజిక వర్గం మద్దతు కూడా కాంగ్రెస్ కు ఉండేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారట.

"""/" / ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ తో పాటు,  కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న ఆ సామాజిక వర్గం అభ్యర్థుల విజయానికి చంద్రబాబు పరోక్షంగా సహకరిస్తున్నారు.

అయితే ఏపీలో రెడ్డి , కమ్మ సామాజిక వర్గాలు మధ్య సఖ్యత లేదు.

  కమ్మ సామాజిక వర్గం టిడిపికి మద్దతుగా ఉండగా , రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది .

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని సీఎం చేసేందుకు,  కాంగ్రెస్ ను అధికరంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు, కమ్మ సామాజిక వర్గం గట్టి ప్రయత్నాలే చేస్తోంది.

మరింత భారం కానున్న రీఛార్జిలు.. నిన్న జియో, నేడు ఎయిర్టెల్.. ఇకబాదుడే..