న్యాయ వ్యవస్థలపై టీడీపీ ఆరోపణలు దారుణం..: మంత్రి కాకాణి
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు నేరస్థుడిగా కోర్టు నిర్ధారించిందని తెలిపారు.
న్యాయ వ్యవస్థలపై టీడీపీ నేతల ఆరోపణలు దారుణమని మంత్రి కాకాణి మండిపడ్డారు.కోర్టులో సాంకేతిక కారణాలను మాత్రమే చెబుతున్నారన్నారు.
తాను చేసిన తప్పును కేబినెట్ పై రుద్దే ప్రయత్నం చేశారన్న కాకాణి చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
రెండు ఎకరాల భూమి ఉన్నవారు రూ.2 లక్షల కోట్లకు అధిపతి అయ్యారని విమర్శించారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో పవన్ కు కూడా వాటాలు వచ్చాయన్న మంత్రి కాకాణి పవన్, చంద్రబాబు ఇద్దరూ ప్యాకేజీలు పంచుకున్నారని ఆరోపించారు.
ఇంత సైకోవి ఏంట్రా.. రీల్స్ కోసం రైల్లోని సీట్లను అలా చేసావ్