టీడీపీ ముఖ్య నేతలతో బాబు కీలక భేటీ, గైర్హాజర్ అయిన కాపు నేతలు

ఏపీ రాజకీయాలలో ఇటీవల పెను పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత ఘోర ఓటమి ని చవిచూసిన టీడీపీ పార్టీ రోజు రోజుకు పతనమయ్యే స్థితి కి పడిపోతుంది.

మొన్నటికి మొన్న టీడీపీ పార్టీ కి చెందిన ఎంపీ లు బీజేపీ లో చేరగా, టీడీపీ కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే అంబికా కృష్ణ కూడా బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే.

ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతూ టీడీపీ పార్టీ కి కోలుకొనే టైం కూడా దొరకడం లేదు.

ఇప్పటికే జంప్ జిలానీలతో విసిగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు కు ఇప్పుడు తాజాగా మరికొందరు నేతలు తాను నిర్వహించిన కీలక భేటీ కి డుమ్మా కొట్టడం తో మరింత ఆందోళన పెరిగింది.

బుధవారం చంద్రబాబు నాయుడు తన నివాసం లో పార్టీ ముఖ నేతలతో కీలక భేటీ నిర్వహించారు.

అయితే ఈ భేటీ కి కళా వెంకట్రావు మినహా మిగిలిన కాపు నేతలు అందరూ కూడా డుమ్మా కొట్టినట్లు తెలుస్తుంది.

ప్రజావేదిక కూల్చివేత,అలానే మాజీ సీ ఎం ఉంటున్న నివాస భవనాన్ని కూడా కూల్చివేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై చర్చించాలి అని భావించి బాబు ఈ కీలక భేటీ ని నిర్వహించారు.

అయితే ఈ భేటీ కి బోండా ఉమా,జ్యోతుల నెహ్రు,పంచకర్ల రమేష్ తో పాటు తోట త్రిమూర్తులు కూడా గైర్హాజర్ అయ్యారు.

అయితే ఇటీవల టీడీపీ ఎంపీలు బీజేపీ పార్టీ లో చేరిన రోజునే తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో కాపు నేతల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సమావేశంలో ఈ నలుగురు కూడా హాజరై చర్చలు జరిపారు. """/"/ అలాంటిది ఈ రోజున టీడీపీ ముఖ్య నేతలతో బాబు భేటీ నిర్వహిస్తే వారు ఎందుకు గైర్హాజర్ అయ్యారు అన్న విషయం అర్ధం కాక టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే దాదాపు చాలా మంది బీజేపీ పార్టీ లో చేరేందుకు సిద్దమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ లో చేరేందుకు పలువురు టీడీపీ నేతలు చర్చలు జరిపినట్లు బీజేపీ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ తాజా పరిణామం తో ఏపీ రాజకీయాలలో ఇంకా ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో నెలకొంది.

ముందు ముందు ఎవరెవరు పార్టీ నుంచి నిష్క్రమిస్తారో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ భారత్ లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే..!