యువనేతలూ ఉసూరుమంటున్నారే ? వృద్ధ నేతలే దిక్కవుతున్నారే ?

ఉరకలెత్తే ఉత్సాహంతో పార్టీని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా.తెలుగుదేశం పార్టీలో యువ రాజకీయ నాయకులంతా సైలెంట్ అయిపోయారు.

ఎవరికి వారు తమకు ఎందుకు వచ్చిందిలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.పార్టీ తమకు ఏం చేసింది అనే అభిప్రాయంతోనే ఎక్కువమంది ఉన్నారు తప్ప, పార్టీ కోసం తాము ఏం చేస్తున్నామనే ఆలోచన పెద్దగా ఎవరిలోనూ కనిపించడం లేదు.

ప్రస్తుతం చూసుకుంటే, రాజకీయంగా తెలుగుదేశం పార్టీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.ఒకవైపు టిడిపి అధినేత చంద్రబాబు వయో భారంతో ఇబ్బంది పడుతూనే, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు.

ఏపీలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలోనూ, చంద్రబాబు ఏపీలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపారు.

అలాగే మహానాడు సైతం నిర్వహించి సంచలనం సృష్టించారు.ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ, ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ హడావుడి చేస్తున్నారు.

టిడిపిలో సీనియర్ నాయకులకు కొదవేమీ లేదు.పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగుతూ, పార్టీ కోసం నిబద్ధతతో వ్యవహరిస్తున్న వారు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

ప్రస్తుతం వీరంతా రిటైర్మెంట్ స్టేజి దాటి పోయిన వారే. """/"/ వీరి స్థానంలో వారి వారసులను టిడిపిలో యాక్ట్ చేసినా, ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఎవరూ అంత చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, టిడిపి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండడంతో, ఆ పార్టీ కోసం గట్టిగా గొంతెత్తితే అధికార పార్టీ ఆగ్రహానికి గురి కావల్సి వస్తుందేమో అన్న అభిప్రాయం, అలాగే తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు పైన అనుమానాలు ఉండటంతో, ఎవరికి వారు సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

టిడిపిలో రాజకీయ వారసులకు కొదవేమి లేదు.ప్రతి జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు యువ నాయకులు టిడిపికి ఉన్నారు.

వీరంతా లోకేష్ తో సన్నిహితంగానే ఉంటూ వస్తూ, పార్టీ కార్యక్రమాలు విషయానికి వచ్చేసరికి పక్కకు తప్పుకుంటూ ఉండటం, పార్టీ కార్యక్రమాల కంటే, సొంత వ్యాపారాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తూ వుండడం వంటి పరిణామాలతో టిడిపిలో యువ నాయకుల సందడి కనిపించకపోవడానికి కారణం అని అర్థం అవుతోంది.

 తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ సీనియర్ నాయకులే చక్రం తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రాజమౌళికి ఆ సినిమా అంత కష్టంగా అనిపించిందా.. ఐరన్ లెగ్ అన్నా పట్టించుకోరా?