గెలుపు పై వైసీపీ నమ్మకం అదే.. టీడీపి నమ్మకం ఇదే 

2024 లో జరగబోయే ఏపీ ఎన్నికల్లో( AP Elections ) గెలుపు తమదే అన్న ధీమాలో ప్రధాన పార్టీలన్ని ఉన్నాయి అధికార పార్టీ వైసీపీ( YCP ) తాము అమలు చేస్తున్నారు సంక్షేమ పథకాలు మళ్లీ తమకు అధికారం కట్టబడుతుంది అనే నమ్మకంతో ఉండగా , టిడిపి  ( TDP )తమతో జనసేన పొత్తు పెట్టుకోవడం,  ఏపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత పెరగడం ఇవే తమకు అధికారాన్ని తెచ్చిపెడతాయనే నమ్మకంతో ఉంది.

ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా,  తాము సింగిల్ గానే వస్తామని ఇప్పటికే వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( CM Jagan ) ప్రకటించారు.

ఇంకా ఏపీలో ఎన్నికలకు దాదాపు నాలుగు నెలల సమయం ఉంది.దీంతో అధికార పార్టీ వైసిపి స్పీడ్ పెంచింది.

  ఏపీలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూనే ప్రథాక్షేత్రంలోకి పార్టీ శ్రేణులు వెళ్లే విధంగా కార్యక్రమాలను జగన్ రూపొందించి అమలు చేస్తున్నారు .

మొన్నటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పరిమితమైన జగన్ సైతం ఇప్పుడు జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పర్యటనలు మొదలుపెట్టారు .

ఎన్నికలు దగ్గరకు వచ్చేనాటికి మరింత స్పీడ్ గా జనాలకు దగ్గర అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తుండగా , టిడిపి , జనసేన సైతం అంతే స్థాయిలో ఉమ్మడి కార్యాచరణను రూపొందించుకుని ఏపీలో ప్రభుత్వ వైఫల్యాల పై పోరాటం చేపట్టి జనాల్లో తమ రెండు పార్టీలపై సానుకూలత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

"""/" / గత ఎన్నికల్లో టిడిపి 40 సీట్లలో కేవలం 5000 ఓట్లు తేడాతో ఓడిపోయినట్లుగా గుర్తించింది.

జనసేన( Janasena ) పొత్తు ద్వారా ఇప్పుడు ఆ సీట్లన్నీ తమ ఖాతాలో పడతాయి అని,  ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రధాన ప్రతిపక్షాలకే పడుతుందని రెండు పార్టీలు భావిస్తున్నాయి.

  ముఖ్యంగా ఉద్యోగులు , మధ్య తరగతి ప్రజలు తమ పార్టీలవైపే మొగ్గు చూపిస్తారని ఆశలు పెట్టుకుంది.

పేద ఓటర్లు సరి సమానంగా ఓట్లు వేస్తారని అంచనా వేస్తోంది.అమరావతిని( Amaravati ) రాజధానిగా కొనసాగించేందుకు జగన్ ఇష్టపడకపోవడం , ప్రభుత్వ పాలన వైఫల్యాలు, గడిచిన నాలుగు ఏళ్లలో ఉపాధి అవకాశాలు పెద్దగా లేకపోవడం, ఏపీలో అభివృద్ధి లేకపోవడం , ఇవన్నీ తమకు కలిసి వస్తాయని టిడిపి అంచనా వేస్తోంది.

"""/" / వైసిపి మాత్రం ఏపీలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుకర పరిస్థితులు ఉన్న సంక్షేమ పథకాలు ఎక్కడా లోటు రాకుండా చూసుకోవడం ,  ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను గతంతో పోలిస్తే బాగా అభివృద్ధి చేయడం,  వలంటీర్లు,  సచివాలయ వ్యవస్థతో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చేస్తుండడం , పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఎలా ఎన్నో సంక్షేమ పథకాలు ద్వారా లబ్ధి పొందిన వారంతా తమవైపు ఉంటారని , అదే తమకు మళ్లీ అధికారం తెచ్చిపెడుతుంది అనే నమ్మకంతో జగన్ ఉన్నారు.

ఇటలీలో దయనీయ స్ధితిలో భారతీయ కార్మికుడి మృతి .. రోజుల తర్వాత యజమాని అరెస్ట్