జగన్ చెవులో పూలు పెడుతూ అమ్మఒడికి చిల్లు పెట్టారంటు వంగలపూడి అనిత వినూత్న నిరసన..

విశాఖ: టిడిపి మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆధ్వర్యంలో వినూత్న నిరసన.

చేవులో పూలు, చిరిగిన చీరలతో నిరసన.జగన్ చేవులో పూలు పెడుతూ.

అమ్మఒడికి చిల్లు పెట్టారంటు నిరసన.తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షరాలు అనిత కామెంట్స్.

2017 ప్లీనరి సభలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత పిల్లలకు చదువు కు ఖర్చు నేను భరిస్తానని జగన్ ఆనాడు చేప్పాడు.

జగన్ ప్రభుత్వం వచ్చాక 15000 అమ్మఒడి అన్నారు .మొదటి సారి 80 లక్షల మంది అమ్మఒడి లబ్ధిదారులు ఉంటే 44 లక్షలు మందికి వేసారు.

రెండోవిడత వేయి రూపాయలు కుదించి 14వేలు ఇచ్చారు.వేయ్యి రూపాయలు సానిటైషన్ కోసం అన్నారు .

ఇప్పుడు మూడో విడత పెద్ద చిల్లు పెట్టి చేవులో పూలు పెడుతున్నారు.మొన్న 75 శాతం హజరు నిన్న కరెంట్ బిల్లుతో లింకు పెట్టారు.

అమ్మలు ఆడపడుచులు జగన్ పెట్టే చిల్లులు గ్రహించండి.జగన్ మోసం కాదు ద్రోహం చేస్తున్నాడు.

నాడు నేడు లో పాత బడులుకు కొత్త రంగులు వేస్తున్నారు.కొత్త బడులు కట్టలేదు .

చిన్న పిల్లలు సైతం స్కూలులో గంజాయి వాడుతున్నారు.అమ్మఒడి డబ్బులు నాన్న బుడ్డి నుండి వస్తున్నాయి.

వాటి నుండి వచ్చే డబ్బులతో ముష్టి వేస్తున్నారు.గురజాల రైల్వేస్టేషన్ లో ఓరిస్సా అమ్మాయిని గంజాయి బ్యాచ్ అత్యాచారం చేసారు.

ఆ అమ్మాయికి 32 కుట్లు పడ్డాయి.ఎమీ మీకు కనిపించడం లేదా.

ఎవ్వరు స్పందించడం లేదు .హోంమంత్రి గా ప్రమాణం చెసిన మూడు రోజుల్లో మూడు అత్యాచారాలు జరిగాయి.

మంత్రి ర్యాలీ కోసం ఒ పసిబిడ్డను చంపారు.కనీసం అంబులెన్స్ కు దారి ఇవ్వాలని జ్ఞానం కూడ లేదు.

కరెంట్ బిల్లులు సైతం పెంచుకుంటు పోయారు.ఈ సారి బిల్లులు ఇస్తే మహిళలే తన్నుతారు.