టీడీపీ ఇజ్ఞత్ తీసిన బాబు  నిర్ణయం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఘనమైన చరిత్ర ఉంది.పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే దాన్ని అధికారంలోకి తీసుకు రావడంలో ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు.

ఇక ఆ తర్వాత క్రమంలో టిడిపి చంద్రబాబు చేతికి వచ్చింది.ఆయన సైతం టీడీపీ గ్రాఫ్ మరింత పెరిగేలా చేశారు.

టిడిపి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడ వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకు వెళ్లేలా చేస్తూ ఉండేవారు.

కానీ 2019 తర్వాత మాత్రం పరిస్థితి మారిపోయింది అధికారపార్టీ వైసిపి దూకుడును తట్టుకోవడం కష్టం అనే అభిప్రాయం కు బాబు వచ్చినట్లుగా కనిపిస్తోంది.

అందుకే ఎప్పుడు లేని విధంగా పరిషత్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

అసలు ఎన్నికలను బహిష్కరించడానికి కారణం ఓటమి భయం అనేది అందరి అభిప్రాయం.ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం ప్రభావం ఏమాత్రం కనిపించకపోగా,  గతంలో ఉన్న పేరు ప్రఖ్యాతలు సైతం దెబ్బతిన్నాయి.

పోనీ ఆ విషయంలో ఎన్నికల కమిషన్ పైన నిందలు వెళ్దామన్నా , వైసిపి కి శత్రువుగా, తమకు మిత్రుడుగా అన్నట్లుగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి.

అయినా నిరాశ తప్పలేదు.ఇప్పుడు చూస్తే ఏపీ ఎన్నికల అధికారి గా జగన్ కు సన్నిహితరాలిగా ముద్రపడిన మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని నియమితులయ్యారు .

"""/"/  అదికాకుండా వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో ఆదరణ ఉండటం, తెలుగుదేశం పార్టీ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనడం వంటి కారణాలతో ఇప్పుడు పరిషత్ ఎన్నికలకు వెళ్లినా, ఓటమి తప్పదని, పోటీచేసి అవమానానికి గురి అయ్యే కంటే,  ఎన్నికలను బహిష్కరిస్తెనే మేలు అని నిర్ణయించుకుని ఇప్పుడు ఎన్నికలకు దూరంగా ఉంటుంది.

అయితే ఈ నిర్ణయం మాత్రం తెలుగుదేశం పార్టీ నీ ఉనికి పై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీ శ్రేణులకు మింగుడుపడటంలేదు.

ఓటమైనా, విజయం అయినా ఎక్కడ వెనకడుగు వేయకుండా, ధైర్యంతో ముందడుగు వేసే చంద్రబాబు ఇప్పుడు మాత్రం వెనకడుగు వేస్తూ, పార్టీ శ్రేణులను మరింత ఆందోళన లోకి నెట్టడం ఖచ్చితంగా టిడిపి రాజకీయ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెడుతుంది అని, ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కనిపించడంతో పాటు,  పెద్ద ఎత్తున పార్టీలోకి టిడిపి నాయకులు వెళ్లే అవకాశం కల్పించినట్లు ఇప్పుడు జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

వైరల్ వీడియో: కాబోయే వరుడికి షాక్ ఇచ్చిన వధువు.. పక్కనే ఉండి..?