కడపను టార్గెట్ చేసిన టీడీపీ .. అలెర్ట్ అవుతున్న జగన్

గత వైసిపి ప్రభుత్వంలో టిడిపి అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పం నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో అయితే టార్గెట్ చేసుకున్నారో అంతకు మించిన స్థాయిలో జగన్ ను టార్గెట్ చేసుకునే విధంగా టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) వ్యూహం రచిస్తున్నారు .

దీనిలో భాగంగానే వైసీపీకి,  జగన్ కు కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు, టిడిపి బలం పెంచుకునే విధంగా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దీనిలో భాగంగానే కడప జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.  కడపలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పలితాలే టిడిపి సాధించింది .

ఇప్పుడు జెడ్పీ పీఠాన్ని కూడా దక్కించుకునేందుకు కసరత్తు మొదలు పెట్టింది.కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికలకు ముందు వరకు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వ్యవహరించారు .

తాజా ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

"""/" / కడప జిల్లా పరిషత్ లో 50 మంది జడ్పిటిసిలు ఉన్నారు.

అందులో ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.కడప జిల్లాలో ఎన్నికల ఫలితాలు తర్వాత ఐదుగురు జడ్పిటిసిలు టిడిపిలో చేరగా,  మరో జెడ్పిటిసి బిజెపికి దగ్గరయ్యారు.

మిగిలిన జెడ్పీటీసీలో తోను జిల్లాకు చెందిన టిడిపి, బిజెపి నేతలు మంతనాలు చేస్తుండడం,  జగన్( YS Jagan Mohan Reddy ) ను ఆయన సొంత జిల్లాలోనే రాజకీయంగా దెబ్బతీసేందుకు టిడిపి ప్రయత్నిస్తూ ఉండడంతో,  ఈ వ్యవహారాన్ని జగన్ సీరియస్ గానే తీసుకున్నారు .

ఈ మేరకు తాజా రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా నాయకులతో సమీక్షిస్తూ,  జెడ్పిటిసిలు ఎవరూ టిడిపి కూటమివైపు వెళ్ళకుండా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దీనిలో భాగంగానే కడప జిల్లాలోని పార్టీకి చెందిన జెడ్పిటిసి లందరూ ఈ నెల 21వ తేదీన తాడేపల్లికి రావాల్సిందిగా జగన్ సూచించారు.

"""/" / వారిని తీసుకువచ్చే బాధ్యతను పార్టీ కీలక నేతలకు జగన్ అప్పగించారు.

వారితో జగన్ నేరుగా సమావేశం కాబోతున్నారు.వారికి భవిష్యత్తు పైన భరోసా ఇస్తూ, పార్టీ మారకుండా నచ్చచెప్పే ప్రయత్నం జగన్ చేయనున్నారు.

ఇప్పటికే కొంతమంది వైసీపీకి చెందిన జెడ్పీ టీసీలు టిడిపికి టచ్ లోకి వెళ్లడంతో జగన్ వారితో ప్రత్యేకంగా సమావేశం అవుతారట.

టాలీవుడ్ కు ఒకే ఒక్క అవార్డ్.. అవార్డుల విషయంలో మనకు అన్యాయం జరిగిందా?