టీడీపీ తంగళ్లపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల టిడిపి నూతన కమిటీని సిరిసిల్ల( Sirisilla ) నియోజకవర్గం ఇన్చార్జి ఆవునురి దయాకర్ రావు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులుగా కడారి రాంరెడ్డి ని శుక్రవారం ఏకీగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.

మండల ఉపాధ్యక్షులుగా పంజా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా పయ్యావుల లక్ష్మణ్, కార్యదర్శిగా కందుకూరి మహేష్, అధికార ప్రతినిధిగా మిద్దె ప్రకాష్, ప్రచార కార్యదర్శిలుగా సింగిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం లింగగౌడ్ లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి ఆవునూరి దయాకర్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తంగళ్లపల్లి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

మాటల మాంత్రికుడు కేసీఆర్( KCR ) ఇచ్చిన వాగ్ధానాలన్నీ శుష్కప్రయాలు శూన్యహస్త్రాలుగా మిగిలిపోయాయని,దళిత ముఖ్యమంత్రి మొదలుకొని నిన్న ప్రకటించినా రైతు రుణమాఫీ వరకు హామీలన్నీ అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు.

కేటీఆర్ నిన్న బిఆర్ఎస్ కార్యకర్తలను ఊర్లల్లో సంబురాలు చేయాలని పిలుపునివ్వడం విడ్డురంగా ఉందని ఈ సందర్భంగా ఎద్దేవాచేశారు.

ఊర్లల్లో సంబురాలు దేనికోసం ధరణి పోర్టల్ దగా అయినందుకా, రైతు బంధు పూర్తి స్థాయిలో అమలుకనందుకా,రైతు రుణమాఫీ కానందుకా, పొడుభూములను వారి పార్టీ కార్యకర్తలు పంపిణీ చేసినందుక, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనందుకా అని ప్రశ్నించారు.

దళితబంధు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు , కేజీ టూ పీజీ విద్యా అమలు చేయనందుక అని ప్రశ్నించారు.

రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, మచ్చ ఆంజనేయులు, మాలోత్ సూర్యనాయక్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మోతె రాజిరెడ్డి,దత్తాద్రి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి…